https://oktelugu.com/

Mega Family vs Manchu Family: మోహ‌న్ బాబు, విష్ణుపై మెగా ఫ్యామిలీ ప్ర‌తీకారం.. ఇండ‌స్ట్రీ రెండుగా చీలుతుందా?

Mega Family vs Manchu Family : ఇన్నాళ్లు దాగుడు మూతులుగా సాగిన ఫైట్ ఇప్పుడు డైరెక్ట్ గా మారింది. మంచు, మెగా ఫ్యామిలీల మ‌ధ్య ఫైట్ రచ్చ‌కెక్కింది. తెర‌వెనుక జ‌రిగిన యుద్ధాన్ని మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు తెర‌ముందుకు తీసుకొచ్చారు. మోహ‌న్ బాబు, మంచు విష్ణుల‌ను ఇరుకున‌పెట్టేలా యుద్ధానికి దిగారు. మంచు ఫ్యామిలీ చేతిలో కేసుల‌కు గురైన బాధితుల‌కు మెగా ఫ్యామిలీ త‌రుపున నాగ‌బాబు ఆర్థిక సాయం చేయ‌డం ఇండ‌స్ట్రీలో చిచ్చుపెట్టింది. మంచు ఫ్యామిలీకి వ్య‌తిరేకంగా డైరెక్టుగా […]

Written By:
  • NARESH
  • , Updated On : March 4, 2022 / 12:24 PM IST
    Follow us on

    Mega Family vs Manchu Family : ఇన్నాళ్లు దాగుడు మూతులుగా సాగిన ఫైట్ ఇప్పుడు డైరెక్ట్ గా మారింది. మంచు, మెగా ఫ్యామిలీల మ‌ధ్య ఫైట్ రచ్చ‌కెక్కింది. తెర‌వెనుక జ‌రిగిన యుద్ధాన్ని మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు తెర‌ముందుకు తీసుకొచ్చారు. మోహ‌న్ బాబు, మంచు విష్ణుల‌ను ఇరుకున‌పెట్టేలా యుద్ధానికి దిగారు. మంచు ఫ్యామిలీ చేతిలో కేసుల‌కు గురైన బాధితుల‌కు మెగా ఫ్యామిలీ త‌రుపున నాగ‌బాబు ఆర్థిక సాయం చేయ‌డం ఇండ‌స్ట్రీలో చిచ్చుపెట్టింది. మంచు ఫ్యామిలీకి వ్య‌తిరేకంగా డైరెక్టుగా నాగ‌బాబు దూకుడుగా ముందుకెళుతున్న‌ట్టు అర్థ‌మైంది. ఈ వ్య‌వహారం ఇప్పుడు టాలీవుడ్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

    Nagababu

    టాలీవుడ్ ఇండ‌స్ట్రీ పెద్ద కోసం కొద్ది రోజులుగా టాలీవుడ్ లో పెద్ద యుద్ధ‌మే జ‌రుగుతోంది. మెగాస్టార్ చిరంజీవిని ఇండ‌స్ట్రీ పెద్ద‌గా గుర్తించ‌డానికి మోహ‌న్ బాబు ఫ్యామిలీ అస్స‌లు ఇష్ట‌ప‌డ‌డం లేదు. మా ఎన్నిక‌ల్లోనూ మెగా ఫ్యామిలీ బ‌ల‌ప‌రిచిన ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గాన్ని మంచు ఫ్యామిలీ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఓడించేసింది. ఈ క్ర‌మంలోనే ర‌గిలిపోయిన మెగా ఫ్యామిలీ అప్ప‌టి నుంచి గుర్రుగా ఉంద‌న్న టాక్ వినిపిస్తోంది.

    నాటి నుంచి మెగా, మంచు ఫ్యామిలీల మ‌ధ్య వైరం తెర‌వెనుక కొన‌సాగుతూనే ఉంది. ఏపీ సీఎం జ‌గ‌న్ తో చిరంజీవి భేటి కూడా మోహ‌న్ బాబులో అస‌హ‌నానికి దారితీసింది. దానిపై ఆయ‌న లేఖ‌ల‌తో త‌న అసంత్రుప్తిని వ్య‌క్తం చేశారు. ఇక ఇటీవ‌ల మంచు విష్ణు ఆఫీసులో దొంగ‌త‌నం కేసు సంచ‌ల‌న‌మైంది. నాయీ బ్రాహ్మ‌ణ యువ‌కుడిపై మంచు విష్ణు కేసులు పెట్ట‌డం.. మోహ‌న్ బాబు తిట్ట‌డంతో అది కాస్త హాట్ టాపిక్ గా మారింది. వివాదం చెల‌రేగింది. మంచు ఫ్యామిలీపై నాయీ బ్రాహ్మ‌ణ సంఘాలు ఆందోళ‌న బాట కూడా ప‌ట్టాయి.

    Also Read: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సెన్సార్ రిపోర్ట్ వ‌చ్చేసింది.. మూవీ అలా ఉంటుంద‌ట‌

    ఈ వివాదాన్ని మ‌రింత ర‌గిలించేందుకు ఇప్పుడు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు రంగంలోకి దిగారు. నేరుగా మంచు విష్ణు కేసు పెట్టిన నాయీ బ్రాహ్మ‌ణ యువ‌కుడు నాగ‌శ్రీనును చేర‌దీశారు. కేసుల‌తో అప్పుల‌పాలైన ఆ యువ‌కుడిని త‌న కార్యాల‌యంలోకి పిలిపించుకొని రూ.50వేల ఆర్థిక సాయం చేశారు. వారి పిల్ల‌ల చ‌దువుల‌కు సాయం చేస్తామ‌ని.. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామ‌ని నాగ‌బాబు భరోసా క‌ల్పించారు. దీంతో ఈ వివాదం స‌రికొత్త మ‌లుపు తిరిగింది.

    మంచు ఫ్యామిలీపై నేరుగా మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగిన‌ట్టైంది. మోహ‌న్ బాబు కేసు పెట్టిన బాధితుల‌కు అండ‌గా మెగా బ్ర‌ద‌ర్ నిల‌వ‌డంతో ఇది ఇండస్ట్రీలోని రెండు కుటుంబాల మ‌ధ్య నేరుగా యుద్ధం మొద‌లైన‌ట్టైంది. నాగ‌బాబు వ్య‌వ‌హార‌శైలి చూస్తుంటే మంచు ఫ్యామిలీని నేరుగానే టార్గెట్ చేసిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఈ వ్య‌వ‌హారంలో ఇంత వ‌ర‌కూ మంచు ఫ్యామిలీ అయితే స్పదించ‌లేదు. మున్ముందు ఇది ఇండ‌స్ట్రీని రెండు వ‌ర్గాలుగా విడిపోయేలా చేస్తుంద‌న్న భ‌యాలు వెంటాడుతున్నాయి. ఏం జ‌రుగుతుంద‌నేది మున్ముందు చూడాలి.

    Also Read: వ‌చ్చే జ‌న్మంటూ ఉంటే అలా పుట్టాల‌నుంది – రష్మిక మందాన

    Recommended Video: