Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యింది. పర్సనల్ లైఫ్ లో విశేషాలను, సినీ కెరీర్ లోని సంగతులను ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ వెంట వెంటనే పోస్టులు పెట్టేది. కానీ ఏమైందో ఏమో.. అనూహ్యంగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌ని డిలీట్ చేసేసింది.

నిత్యం సోషల్ మీడియాలో అల్లరి చూసే నిహారికి సడెన్ గా ఇలా ఏకంగా అకౌంట్ నే ఎందుకు డిలీట్ చేసింది ? అంటూ నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. కారణం.. ట్రోల్స్ అని తెలుస్తోంది. రీసెంట్ గా నిహారిక తన జిమ్ వీడియోని షేర్ చేసింది. అయితే, ఆ వీడియోపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి.
ఆ ట్రోల్స్ చూసి ఫీల్ అయిన నిహారిక, ఇలా సడెన్ గా తన అకౌంట్ ను డిలీట్ చేసింది. ఇక యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా కొనసాగుతుంది. పలు వెబ్ సిరీస్‌లతో పాటు చిన్న సినిమాలను కూడా వరుసగా నిర్మిస్తోంది.

తనకు మెగా అండ ఉన్నా.. ఇండస్ట్రీలో ఈ మెగా డాటర్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక 2020, డిసెంబర్9న చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకొని అటు ఫ్యామిలీ లైఫ్‌ను, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతుంది.
అన్నట్టు నిహారిక నిర్మించిన గత సినిమా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ మంచి విజయాన్ని సాధించింది.