Nagababu: మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు విజయాలను కూడా ఖాతాలో వేసుకుంటున్నారనే సంగతి తెలిసిందే. ఆరెంజ్ సినిమా రిజల్ట్ తర్వాత సినిమాల నిర్మాణానికి దూరమైన నాగబాబు జబర్దస్త్ షో ద్వారా మళ్లీ పాపులర్ అయ్యారు. జబర్దస్త్ షోలో నాగబాబు నవ్వుకు కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ షో సక్సెస్ కావడంలో నాగబాబు పాత్ర ఎంతో ఉందనే సంగతి తెలిసిందే.
నాగబాబు జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరించిన సమయంలో ఆ షోకు మంచి రేటింగ్స్ కూడా వచ్చాయి. కొందరు కమెడియన్లు సైతం నాగబాబు స్కిట్లు చేసే సమయంలో సూచనలు చేసేవారని వెల్లడించారు. అయితే వేర్వేరు కారణాల వల్ల నాగబాబు జబర్దస్త్ షోకు దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగబాబు జీ తెలుగు ఛానల్ లో ప్రసారమవుతున్న అదిరింది షోకు జడ్జిగా వ్యవహరించడం గమనార్హం.
అయితే అదిరింది షో ఆశించిన స్థాయిలో రేటింగ్ ను సొంతం చేసుకోవడంలో ఫెయిలైంది. వేర్వేరు కారణాల వల్ల ఈ షో హిట్ కాలేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. ఈ షో తర్వాత కొంతకాలం టీవీ షోలకు దూరంగా ఉన్న నాగబాబు స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షోతో మళ్లీ బిజీ అయ్యారు. నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తుండటం ఈ షోకు మరింత ప్లస్ అవుతోంది.
ఈ షోకు ఒక్కో ఎపిసోడ్ కు నాగబాబుకు 2 నుంచి 3 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ గా దక్కుతోందని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో నాగబాబు రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.