https://oktelugu.com/

Mega 157: మెగా 157 కోసం ఏకంగా ఐశ్వర్య రాయ్… మరో ఇద్దరు టాప్ హీరోయిన్స్!

కాగా ఆమె తెలుగులో పూర్తి స్థాయి చిత్రం చేస్తున్నారట. అది కూడా మెగాస్టార్ చిరంజీవికి జంటగా నటిస్తున్నారట. ఈ మేరకు టాలీవుడ్ లో షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

Written By:
  • Shiva
  • , Updated On : September 23, 2023 / 06:39 PM IST

    Mega 157

    Follow us on

    Mega 157: సౌత్ ఇండియాకు చెందిన ఐశ్వర్య రాయ్ ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమాలో హీరోయిన్ గా చేయలేదు. ఆమె తమిళంలో నటించారు కానీ ఎందుకో టాలీవుడ్ పై ఆసక్తి చూపలేదు. ఆమెను హీరోయిన్ గా పరిచయం చేసిన మణిరత్నం దర్శకత్వంలో ఇద్దరు, విలన్, పీఎస్ 1 అండ్ 2 చిత్రాలు చేసింది. అలాగే శంకర్ దర్శకత్వంలో రెండు చిత్రాలు చేసింది. నాగార్జున హీరోగా తెరకెక్కిన రావోయి చందమామ చిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. రావోయి చందమామ ఐశ్వర్య కనిపించిన వన్ ఓన్లీ తెలుగు మూవీ. అందగత్తెగా దశాబ్దాల పాటు కుర్ర హృదయాలను ఏలిన ఐశ్యర్య క్రేజ్ పెళ్ళైనా తగ్గలేదు.

    కాగా ఆమె తెలుగులో పూర్తి స్థాయి చిత్రం చేస్తున్నారట. అది కూడా మెగాస్టార్ చిరంజీవికి జంటగా నటిస్తున్నారట. ఈ మేరకు టాలీవుడ్ లో షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో చిరంజీవి మూవీ ప్రకటించారు. బింబిసార ఫేమ్ వశిష్ట్ మల్లిడి ఈ చిత్ర దర్శకుడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.

    ఇది సోషియో ఫాంటసీ సబ్జెక్టు అంటున్నారు. ప్రకటన పోస్టర్ పంచ భూతాలైన నీరు, గాలి, అగ్ని, భూమి, ఆకాశాలతో డిజైన్ చేశారు. వినూత్నమైన కథతో భారీగా తెరకెక్కిస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే ఆలోచనలో ఉన్న టీమ్ అదే స్థాయిలో క్యాస్టింగ్ తీసుకుంటున్నారని సమాచారం. చిత్ర కథ మూడు లోకాల్లో సాగుతుందనే వాదన ఉంది. ఇక మూడు లోకాల్లో చిరంజీవి ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తాడట.

    వారిలో ఒకరు ఐశ్యర్య రాయ్ అంటున్నారు. అలాగే అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ లను ఎంపిక చేశారట. ఈ మేరకు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ప్రచారం అవుతున్న వార్తల్లో నిజమెంతో కానీ భారీ హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ ఏడాది చిరంజీవికి మిశ్రమ ఫలితాలు దక్కాయి. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ కాగా భోళా శంకర్ డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. మెగా 157తో ఆయన గ్రేట్ కమ్ బ్యాక్ ఇస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.