Meet Cute Review తారాగణం: అదా శర్మ, సత్య రాజ్, రుహానీ శర్మ, వర్ష బొల్లమ్మ, రాజ్ చెంబోలు, రోహిణి,ఆకాంక్ష సింగ్, అశ్విని కుమార్, శివ కందుకూరి, సునైన..
సంగీతం: విజయ్, ఎడిటింగ్: గ్యారీ బీ. హెచ్, సినిమాటోగ్రఫీ: వసంత్ కుమార్, నిర్మాత: నాని, ప్రశాంత్ త్రిపర్నేని, దర్శకత్వం: దీప్తి, స్ట్రీమింగ్: సోని లీవ్ యాప్.
కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచి మారింది.. రొటీన్ సినిమాలు ఇష్టపడటం లేదు. ఓటిటిలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ లను చూసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.. అందులో భాగంగానే ఓటీటీ లు వెబ్ సీరిస్ లను నిర్మిస్తున్నాయి. ఇక హీరోగా, నిర్మాతగా నిరూపించుకున్న నటుడు నానీ.. వెబ్ సిరీస్ ల నిర్మాణం లో అడుగు పెట్టారు.. అలా నాని నిర్మాతగా రూపొందించిన వెబ్ సీరిస్.. మీట్ అండ్ క్యూట్ ప్రశాంతి త్రిపురనేని కూడా దీని నిర్మాణం లో పాలు పంచుకున్నారు. ఎక్కువగా యువకులకు, అందునా కొత్త వాళ్లకి అవకాశం ఇచ్చే నాని.. ఈసారి తన సోదరికి దర్శకురాలిగా అవకాశం ఇచ్చారు. మరీ దీప్తి ఈ సీరిస్ ద్వారా మెప్పించిందా…ఈ రివ్యూ లో చూద్దాం.
ఐదు కథలు
*ఈ వెబ్ సీరిస్ ద్వారా దీప్తి ఐదు కథలు చెప్పారు. మొదటి దాంట్లో స్వాతి( వర్ష బొల్లమ్మ) తన అమ్మ చెప్పిందని పెళ్ళి చూపుల్లో భాగంగా అభి (అశ్విని కుమార్) కలుస్తుంది. మాటలో మధ్యలో అభి.. కావాలనే మ్యాట్రి మోని సైట్ లో తప్పుడు వివరాలు తప్పు ఇచ్చానని స్వాతి తో చెబుతాడు. స్వాతి అతణ్ణి క్షమిస్తుందా? అనేది తొలి ఎపిసోడ్ మీట్ ది బాయ్ లో తెలుస్తుంది.
*సరోజ(రుహానీ శర్మ), మోహన్ రావు( సత్య రాజ్) వీసా ఆఫీస్ లో కలుసు కుంటారు. అతడికి సాయం చేసిన సరోజ..తన కాపురంలో కలహాల గురించి వివరిస్తుంది. తన అనుభవంతో మోహన్ రావు.. సరోజ ఆలోచన మార్చగలిగడా? అనేది ” ఓల్డ్ ఈజ్ గోల్డ్” ఎపిసోడ్ లో తెలుస్తుంది.
*భర్తకు దూరమై, ఆర్కిటెక్ట్ గా పని చేసే పూజ( ఆకాంక్ష సింగ్), సిద్దు (దీక్షిత్ శెట్టి) అనే యువకుడికి దగ్గర అవుతుంది. వీరి వ్యవహారం గురించి తెలుసుకున్న సిద్దు తల్లి పద్మ( రోహిణి) ఏం చేసింది? అనేది “ఇన్ లవ్” ఎపిసోడ్ లో తెలుస్తుంది..
*అమన్( శివ కందుకూరి) ఒక వైద్యుడు. ఓ రాత్రి శాలిని(ఆదా శర్మ) అనే నటికి కారులో లిఫ్ట్ ఇస్తాడు. తన ఇంటికి తీసుకు వెళ్తాడు. ఆమె నటి అని తెలియని అమన్ తన ఇష్టాయిష్టాలు చెబుతాడు. మరి శాలిని యాక్టర్ అనే విషయం అమన్ కు తెలిసిందా? అనేది స్టార్ స్ట్రక్ అనే ఎపిసోడ్ లో తెలుస్తుంది..
*అజయ్( గోవింద్ పద్మ సూర్య) అనే వ్యక్తితో కిరణ్( సునైన) కు బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత అజయ్ తో రిలేషన్ షిప్ లో ఉన్న అంజన( సంచిత) ను కలిసి ఏం వివరించింది. “ఎక్స్ గాళ్ ఫ్రెండ్” ఎపిసోడ్ లో తెలుస్తుంది.
-ఎలా ఉందంటే..?
పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు మొదటిసారి కలిసినప్పుడు మాట్లాడుకునే మాటలు .. ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయని ఈ వెబ్ సిరీస్ ప్రారంభంలోనే చెబుతారు. మీట్ అండ్ క్యూట్ అనే పదానికి ఇదే అర్థం అని వివరిస్తారు. ఇందులో ఉన్న ఐదు ఎపిసోడ్లు కూడా పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు మొదటిసారి కలిసిన వృత్తాంతం తోనే సాగుతాయి . వాటి ఆధారంగానే ఈ వెబ్ సిరీస్ దర్శకురాలు దీప్తి కథ రాసుకున్నారు. తొలి ఎపిసోడ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించదు. వచ్చే సీను మొత్తం ఎక్కడో చూసినట్టు అనిపిస్తాయి. ఇక వారు మాట్లాడుకునే మాటలు కూడా పెద్దగా ప్రభావం చూపవు. రెండో ఎపిసోడ్లో ఎమోషన్స్ పెద్దగా పండలేదు. ఇక భర్తను పోగొట్టుకున్న లేదా దూరం చేసుకున్న ఆడవారి మనోభావాలు ఎలా ఉంటాయి? మరో వ్యక్తిని వారు తమ జీవితంలోకి ఆహ్వానిస్తారా? అనే అంశాన్ని చాలా సీరియస్ గా చూపిస్తూనే.. తన కొడుకు చేసే చిలిపి పనుల గురించి తెలుసుకున్న తల్లి పాత్రతో హాస్యం పండించిన తీరు ఆకట్టుకుంటుంది.. ఈ “ఇన్ లవ్ ” ఎపిసోడ్ ఈ వెబ్ సిరీస్ మొత్తానికి ప్రధాన బలంగా నిలిచింది.. నాలుగో ఎపిసోడ్ విషయానికి వస్తే డాక్టర్, యాక్టర్ మధ్య వచ్చే సీన్స్ బలంగా రాసుకుంటే ఇంకా బాగుండేది. వారిద్దరి మధ్య సంభాషణలు రొటీన్ గా అనిపిస్తాయి.. ఫేమస్ యాక్టర్ గురించి డాక్టర్ కు తెలియకపోవడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక చివరి ఎపిసోడ్ లో ట్విస్ట్ మినహా మిగతా మొత్తం సాగదీత అనిపిస్తుంది. అయితే ఈ సిరీస్ మొత్తం ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉంటుంది. ఎక్కడ కూడా ద్వంద్వర్ధాలు ఉండవు. ఈ రోజుల్లో అశ్లీలతకు తావు లేకుండా ఇలాంటి వెబ్ సిరీస్ నిర్మించడం అంటే సాహసం అనే చెప్పాలి.. ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ సిరీస్ రూపొందించారు కాబట్టి… వారు ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది .
-నటన ఎలా ఉందంటే?
సీనియర్ నటులు సత్యరాజ్, రోహిణి తమ అనుభవంతో పాత్రులకు వన్నెతెచ్చారు.. వయసు మీద పడిన వ్యక్తిగా సత్యరాజ్, తల్లిగా రోహిణి ఒదిగిపోయారు.. ఆకాంక్ష సింగ్ పాత్రకు స్కోప్ ఎక్కువ ఉంది.. వర్ష, రుహాని శర్మ, ఆదాశర్మ, సునయన పాత్రలు ఆకట్టుకుంటాయి.. శివ కందుకూరి, అశ్వని కుమార్, లక్ష్మీకాంతన్, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మ సూర్య నటన పర్వాలేదు అనిపిస్తుంది. సిరీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.. విజయ్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది.. వసంత్ సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్ గా ఉంది. ఎడిటర్ గ్యారీ తన కత్తెరకు ఇంకా పదును పెట్టాల్సింది.. చివరి ఎపిసోడ్ లో అయితే చాలా కత్తెరలు పడతాయి.
-ప్లస్ లు
తారాగణం, మూడో ఎపిసోడ్ లో ఉన్న కామెడీ, సందర్భానుసారం వచ్చే పాటలు, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్
-మైనస్ లు
*తెలిసిన కథ కావటం
*చివరి ఎపిసోడ్ సాగదీత అనిపించడం
*ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం
*బలమైన సంభాషణలు రాసుకోకపోవడం.
బాటమ్ లైన్: మీట్ అండ్ క్యూట్.. మూడో ఎపిసోడ్ మాత్రమే క్యుట్
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Meet cute review in telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com