Meesaala Pilla Full Song: ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి భారీ కమర్షియల్ సక్సెస్ తర్వాత అనిల్ రావిపూడి(Anil Ravipudi) మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో కలిసి చేస్తున్న చిత్రం ‘మన శంకర్ వరప్రసాద్ గారు'(Mana Shankar Varaprasad garu). చిరంజీవి సాధారణంగానే కామెడీ టైమింగ్ ఉన్న సినిమాలు చేస్తే ఫ్యాన్స్ తో పాటు, ఆడియన్స్ కూడా థియేటర్స్ వైపు కళ్ళు మూసుకొని క్యూలు కట్టేస్తారు. అలాంటిది ఫ్యామిలీ ఆడియన్స్ లో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ తోడైతే, అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో సినిమా మొదలైన మొదటి రోజే మనమంతా ఊహించాము. ఆ ఊహలకు మించేలాగా ఈ సినిమా ఆడియన్స్ లో ఇప్పటి నుండే పాజిటివ్ హైప్ ని క్రియేట్ చేసుకోవడం మొదలుపెట్టింది. అందుకు మొదటి కారణం నిన్న విడుదలైన ‘మీసాల పిల్ల'(Meesala Pilla) లిరికల్ వీడియో సాంగ్.
కేవలం ప్రోమో తోనే సోషల్ మీడియా ని షేక్ చేసిన ఈ పాట, ఫుల్ లిరికల్ వీడియో వచ్చిన తర్వాత సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో ఎలాంటి యాడ్స్ వేయలేదు కాబట్టి, ఈ పాటకు ఆర్గానిక్ గా 30 లక్షల వ్యూస్ మొదటి 24 గంటల్లో వచ్చాయి. కానీ ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం రీసెంట్ గా విడుదలైన పాన్ ఇండియన్ సినిమాలకు కూడా ఈ పాటకు వచ్చినంత రీచ్ రాలేదు. 24 గంటల్లో దాదాపుగా నెటిజెన్స్ నుండి 3 వేలకు పైగా రీల్స్ పడ్డాయి. పవన్ కళ్యాణ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘ఓజీ’ చిత్రం లోని ఫైర్ స్ట్రోమ్ పాటకు మొదటి 24 గంటల్లో కేవలం రెండున్నర వేల రీల్స్ మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం ఈ పాట మీద మూడు లక్షల రీల్స్ కి పైగా వచ్చాయి. ఇప్పుడు ‘మీసాల పిల్ల’ పాట ట్రెండ్ ని చూస్తుంటే, 1 మిలియన్ కి పైగా రీల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఆ రేంజ్ రీల్స్ వస్తుంది అని చెప్పడానికి కారణం, ఈ పాటలో ఉన్నటువంటి హుక్ స్టెప్స్ అనడం లో ఎలాంటి సందేహం లేదు. కష్టమైన స్టెప్పులు కాకుండా, ప్రతీ ఒక్కరు చేయదగిన విధంగా స్టెప్పులు ఉంటే, కచ్చితంగా అనుకరిస్తూ రీల్స్ చేయడం మొదలు పెడుతారు నెటిజెన్స్. ఈ పాటకు అదే చేస్తున్నారు. చిరంజీవి నుండి ఇంత కూల్ స్టెప్స్ ని ఈమధ్య కాలం లో చూడలేదు ఫ్యాన్స్. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పాట ‘గోదారి గట్టు మీద రామచిలకవే’ రేంజ్ లో ఒక ఊపు ఊపేస్తదని విశ్లేషకులు అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.
