మొన్నటి వరకు నటీనటుల పై బ్యాడ్ కామెంట్స్ చేసి కొన్ని రోజుల హల్ చల్ చేసింది. మొత్తానికి ఎప్పుడూ ఏదొక విషయంలో కావాలని దూరుతూ వార్తల్లో ఉండే మీరా, ఈ సారి మరో రకంగా వార్త అయింది. ఈ హాట్ భామకు చాల రోజుల తర్వాత ఒక సినిమా వచ్చింది. అయితే మీరాకి సిగరెట్ తాగే అలవాటు ఉంది. ఇటీవల సినిమా షూటింగ్ లొకేషన్ లో సిగరెట్ తాగుతూ కనిపించిందట.
పైగా ఎదురుగా ఉన్న దర్శకుడికి సిగరెట్ ని ఆఫర్ చేసిందట. దాంతో ఆ సినిమా దర్శకుడు ఒక్కసారిగా సీరియస్ అయి, అమ్మడు పై తన పూర్తి అసహనాన్ని వ్యక్తం చేశాడు. అలాగే ఆమెను తిట్టినట్లు కూడా తెలుస్తోంది. దాంతో మీరా కూడా దర్శకుడి పై అరుస్తూ సిగరెట్ తాగడం అనేది నా వ్యక్తిగత వ్యవహారం అంటూ నానా రచ్చ చేసిందట.
అయితే తాజాగా ఆ సినిమా దర్శకుడు ఈ తంతు గురించి చెప్పుకొస్తూ ‘షూటింగ్ లొకేషన్ లో సిగెరెట్లు తాగుతూ కనిపించడం, పైగా పక్క వారికీ కూడా ఆఫర్ చేయడం సరికాదు. వర్క్ కి డిస్టబెన్స్ అవుతుంది. అందుకే ఆమెకు దయచేసి సిగరెట్ తాగితే, వెళ్లి కేరవాన్ లోనే తాగి రావాలని సీరియస్ గా చెప్పాను. ఆ సమయంలో ఆమె ఇగో హర్ట్ అయింది. అయితే ఆ తర్వాత మాత్రం ఆమె మళ్ళీ సెట్ లో సిగరెట్ తాగలేదు’ అంటూ సదరు దర్శకుడు చెప్పుకొచ్చాడు.