Pradeep Ranganathan And Meenakshi Chaudhary: ‘కోమలి’ అనే తమిళ్ చిత్రం తో డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత స్వీయ దర్శత్వం లోనే ‘లవ్ టుడే’ వంటి భారీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ హీరో గా నటించి, యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్(PRadeep Ranganathan). స్టార్ హీరోలందరూ యాక్షన్ మూవీస్, భారీ బడ్జెట్ మూవీస్ అంటూ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ, ఇలాంటి పక్కింటి కుర్రాడి పాత్రలు ఉండే సినిమాలు చేయడం పూర్తిగా మానేశారు. దాంతో అలాంటి జానర్ సినిమాలకు అటు తమిళం లో, ఇటు తెలుగు లో కేవలం ప్రదీప్ రంగనాథన్ మాత్రమే ఆడియన్స్ కి ఛాయస్ గా నిలిచాడు. ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ వంటి భారీ బ్లాక్ బస్టర్స్ తర్వాత, ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డ్యూడ్’ కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది.
అలా వరుసగా హీరో గా మూడుసార్లు వంద కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి చరిత్ర సృష్టించిన ప్రదీప్ రంగనాథన్, త్వరలోనే తన స్వీయ దర్శకత్వం లో ఒక సైన్స్ ఫిక్షన్ జానర్ సినిమా చేయబోతున్నాడు. ఇందులో ఆయనే హీరో గా కనిపించనున్నాడు. ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) ని ఎంచుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం లో ఆమెది రెగ్యులర్ హీరోయిన్ టైపు రోల్ కాదట, నటనకు మంచి స్కోప్ ఉన్న రోల్ అట. ఆమె కెరీర్ లోనే ఈ పాత్ర ఒక మైల్ స్టోన్ లాగా నిలిచిపోతుంది అట. అంతటి బలమైన క్యారెక్టర్ ఆమె కోసం డిజైన్ చేసాడట. మరి అది పాజిటివ్ క్యారెక్టరా?, లేదా పూర్తి స్థాయి నెగిటివ్ క్యారెక్టరా? అనేది తెలియాల్సి ఉంది. మీనాక్షి చౌదరి కెరీర్ లో ఎక్కువ శాతం ఫ్లాప్స్ ఉన్నాయి.
కాం ‘లక్కీ భాస్కర్’ చిత్రం తో కెరీర్ లో తొలిసారి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న ఆమె, ఆ తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు నాగ చైతన్య , కార్తిక్ (విరూపాక్ష ఫేమ్) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వృష కర్మ’ అనే మిస్టిక్ జానర్ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తున్న మీనాక్షి చౌదరి, ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి తో ‘అనగనగా ఒక రాజు’ అనే చిత్రం లో కూడా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 14 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె ప్రదీప్ తో చేయబోతుంది.ఈ చిత్రం ఏప్రిల్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.