Jana Nayagan: మన తెలుగు రాష్ట్రాల్లో ఏ భాషకు సంబంధించిన సినిమా ని అయినా జనాలు ఎలా ఆదరిస్తారో మనం దశాబ్దాల నుండి చూస్తూనే ఉన్నాం. సినిమా బాగుంటే చాలు నెత్తిన పెట్టుకొని మరీ ఆరాధిస్తారు మన తెలుగు ప్రజలు. కానీ ఎందుకో ఇదే ఇతర భాషల్లో మన తెలుగు వాళ్లకు ఇసుమంత ఆదరణ కూడా దక్కదు. వాళ్ళ వరకు వచ్చేసరికి అసలు మన సినిమాలను విడుదల చేయనివ్వకుండా చేస్తున్నారు. మరో ఆరు రోజుల్లో రెబల్ స్టార్ ప్రభాస్(Rebel star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రం, అదే విధంగా తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన విజయ్(Thalapathy Vijay) హీరో గా నటించిన ‘జన నాయగన్'(Jana Nayagan Movie) సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి. తెలుగు లో ఈ చిత్రాన్ని ‘జన నాయకుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతం లో ఈ చిత్రాన్ని దిల్ రాజు గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.
తెలంగాణ ప్రాంతం లో ఈ చిత్రానికి జనవరి 9 న గణనీయమైన థియేటర్స్ ని బ్లాక్ చేసి పెట్టుకున్నారట. మరోపక్క రాజాసాబ్ చిత్రానికి తమిళనాడు లో 5 థియేటర్స్ కూడా రానివ్వకుండా చేస్తున్నారట. అన్ని థియేటర్స్ లోనూ ‘జన నాయగన్’ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మన ఇండస్ట్రీ వాళ్ళు ఇంతటీ పోటీ మధ్య కూడా ఒక తమిళ డబ్బింగ్ సినిమాకు థియేటర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, అక్కడ మన తెలుగు సినిమా కనీస స్థాయిలో కూడా విడుదల అయ్యే అవకాశం లేదా?, ఇంత దుర్భరమైన పరిస్థితి ఏంటి?, ఇది తొలిసారి కాదు , ప్రతీసారి ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉన్నాయి. వాళ్ళ పెద్ద హీరో సినిమా విడుదలకు పోటీ గా తెలుగు సినిమా వస్తే వారం రోజుల వరకు ఒక్క థియేటర్ కూడా లేకుండా చేస్తుంటారు. ‘రాజా సాబ్’ చిత్రానికి తమిళనాడు లో భారీ రేంజ్ బిజినెస్ జరిగింది.
ఇప్పుడు ఆ చిత్రం ఇంత తక్కువ థియేటర్స్ లో విడుదలైతే బయ్యర్స్ భారీ నష్టాలను చూడాల్సి వస్తుంది. మరి ఏమి జరగబోతుందో చూడాలి. మరోపక్క దిల్ రాజు పై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మనకు వాళ్ళ రాష్ట్రంలో ప్రాధాన్యత ఇవ్వనప్పుడు, వాళ్ళ సినిమాలను మనం ఎందుకు స్వాగతించాలి?, పైగా విజయ్ సినిమాలు ఈమధ్య కాలం లో తెలుగు లో బాగానే ఆడుతున్నాయి. ఒక్కసారి కూడా ఆయన తెలుగు ఆడియన్స్ కి కృతఙ్ఞతలు చెప్తూ ఒక వీడియో కానీ, ట్వీట్ కానీ వెయ్యలేదు. ఒక్క సినిమాకు కూడా ఆయన తెలుగు రాష్ట్రాల్లో వచ్చి ప్రొమోషన్స్ చేయలేదు. తెలుగు మీద కనీస స్థాయి గౌరవం లేని ఇలాంటి హీరోల సినిమాలను మన ఆడియన్స్ కూడా నిషేధించాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.