Mazaka Movie Twitter Review : హీరో సందీప్ కిషన్ ఒక్క హిట్ అంటూ విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక జోనర్స్ ఆయన ట్రై చేశారు. ఆయన గత చిత్రం ఊరు పేరు భైరవకోన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ కమర్షియల్ గా ఆడలేదు. దాంతో మళ్ళీ నిరాశే ఎదురైంది. దాంతో రవితేజకు ధమాకా రూపంలో హిట్ ఇచ్చిన దర్శకుడు త్రినాథరావు నక్కినతో చేతులు కలిపాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా మజాకా చేశారు. మజాకా థియేటర్స్ లోకి వచ్చేసింది.
#Mazaka is an ordinary and run-of-the-mill timepass entertainer that has a passable 1st half but a 2nd half that loses momentum after a bit and gets tiring towards the end.
A few comedy blocks were well executed especially the interval block. The concept of the film and Rao…
— Venky Reviews (@venkyreviews) February 26, 2025
మజాకా చిత్రంలో సందీప్ కిషన్ కి జంటగా రీతూ వర్మ నటించింది. రావు రమేష్ మరో ప్రధాన పాత్ర చేశాడు. మజాకా మూవీ కథ విషయానికి వస్తే… సందీప్ కిషన్-రావు రమేష్ తండ్రీకొడుకులు. వీరికి ఆడదిక్కు ఉండదు. ఇద్దరు మగాళ్లు ఉండే ఇంట్లో పిల్లలను ఇవ్వడానికి పేరెంట్స్ భయపడుతూ ఉంటారు. దాంతో సందీప్ కిషన్ కి పెళ్లి కాదు. ఈ క్రమంలో సందీప్ కి రీతూ వర్మ పరిచయం అవుతుంది అది ప్రేమగా మారుతుంది. మరోవైపు రావు రమేష్ మరో మహిళతో ప్రేమలో పడతాడు. కట్ చేస్తే.. వారిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. కుటుంబ సభ్యులు అని తెలుస్తుంది.
First half comedy excellent waiting for the second off #Mazaka https://t.co/ChyoFMVF1n
— Lohith_Rebel (@Rebelism_18) February 26, 2025
సందీప్ కిషన్, రావు రమేష్ ప్రేమించిన అమ్మాయిలు ఎవరు? వారి నేపథ్యం ఏమిటీ? ఇంతకీ వారి ప్రేమ ఫలించిందా? అనేది మిగతా కథ. మజాకా మూవీ చూసి ప్రేక్షకులు వన్ టైం వాచ్ అంటున్నారు. ఫస్ట్ హాఫ్ పర్లేదు అన్నట్లు లాగించేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ మాత్రం మరింత ఇబ్బంది పెట్టాడు. స్క్రీన్ ప్లే ఏమంత ఆసక్తిగా సాగదు. ఇంటర్వెల్ బ్యాంగ్ తో పాటు అక్కడక్కడా నవ్వించే సన్నివేశాలు, పంచులు సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు.
#Mazaka -avg movie….
— Saradhi (@PPattupogula) February 26, 2025
సాంగ్స్ నిరాశపరుస్తాయి. రావు రమేష్ నటన హైలెట్, సందీప్ కిషన్ తన పాత్రకు న్యాయం చేశాడని అంటున్నారు. మొత్తంగా మజాకా జస్ట్ ఒక యావరేజ్ మూవీ. ఖాళీగా ఉంటే ఒకసారి థియేటర్ కి వెళ్లి చూడొచ్చు. సోషల్ మీడియా కామెంట్స్ ఆధారంగా మజాకా మూవీ రివ్యూ ఈ విధంగా ఉంది. ఇక సినిమా ఫలితం తేలాలి అంటే వీకెండ్ వరకు వేచి చూడాలి.
Interval block good.. rest antha cringe kaatha lo chalthaa #Mazaka https://t.co/5yCmzFcUF2
— Sai Kiran (@saikirantweetz) February 26, 2025