Mayasabha Series Interesting Update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు గొప్ప సినిమాలను చేశారు. అయితే కొన్ని సిరీస్ లు సెటైరికల్ గా ఉండడం వల్ల ఆయా సిరీస్ లకు మంచి క్రేజ్ అయితే దక్కుతుంది. ఇక పొలిటికల్ సెటైరికల్ గా తెరకెక్కిన ‘మయసభ’ అనే సిరీస్ కి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ అయితే లభిస్తోంది. ఆగస్టు 7వ తేదీన ఈ సిరీస్ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పొలిటికల్ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సిరీస్ ను తెరకెక్కించారు అనే విషయం అయితే మనకు ట్రైలర్లో చాలా స్పష్టంగా తెలియజేశారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి లా జీవితాలను ఆధారంగానే ఈ సిరీస్ అయితే తెరకెక్కింది. మరి దీని వల్ల ప్రస్తుతం ఉన్న రెండు రాజకీయ పార్టీల్లో ఏదైనా అలజడి క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా వీళ్ళ గురించి ఆయన గొప్పగా చూపించాడా? లేదంటే చెడ్డగా చూపించాడా? ఒకరి గురించి హైప్ చేస్తూ మరొకరిని డౌన్ చేసే ప్రయత్నం చేశాడా..?
Also Read: గౌతమ్ గంభీర్ కాదు.. టీమిండియా కు .. రవి శాస్త్రి, అనిల్ కుంబ్లే లాంటి వాళ్లే కావాలిప్పుడు!
అనే ధోరణిలో ఎక్కువ అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇద్దరూ కూడా మొదట ఫ్రెండ్స్ గా ఉండి చిన్న కార్యకర్తలుగా పొలిటికల్ కెరియర్ ని స్టార్ట్ చేసి సీఎంలుగా ఎలా మారారు అనేది కథాంశం గా తీసుకొని ఈ సిరీస్ ని తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది….
మరి ఇలాంటి క్రమంలోనే ఎవరిని తక్కువ చేసి చూపించిన కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ ఈ సిరీస్ ని తెరకెక్కించినట్టయితే ఇద్దరి నుంచి ఈ సినిమాకి మంచి ప్రశంసలైతే దక్కుతాయి. అలా కాకుండా ఒకరిని హైప్ చేసి మరొకరిని డౌన్ చేస్తే మాత్రం విమర్శలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.
మరి ఆయన ఎలాంటి సంఘటనల ద్వారా ఈ సినిమాను చేశాడు. రియల్ ఇన్సిడెన్స్ ని బేస్ చేసుకొని సిరీస్ ని చేశాడా? లేదంటే కల్పితంగా కొన్ని సంఘటనలను సృష్టించి ఈ సినిమాని తెరకెక్కించాడా అనేది తెలియాల్సి ఉంది…ఇక మొత్తానికైతే ఆది పినిశెట్టి, చైతన్యరావులు లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాను దేవకట్టా చాలా సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయితే గాని దీని పరిస్థితి ఏంటి అనేది స్పష్టంగా చెప్పలేము…