MAVIGUN movie cast crew: ఆంధ్ర ప్రదేశ్ కి అమరావతి ని శాశ్వత రాజధాని గా నిర్ధారిస్తూ అసెంబ్లీ లో తీర్మానం చేసి, ఆ తర్వాత నిన్న పార్లమెంట్ లో కూడా బిల్ పాస్ అయ్యేలా చేయడం చారిత్రాత్మిక ఘట్టం గా చెప్పుకోవచ్చు. నేడు రాజ్యసభ లో కూడా ఈ బిల్ పాస్ అవ్వనుంది, ఇక కేవలం ప్రెసిడెంట్ ఆమోద ముద్ర పడితే ఇక అమరావతి శాశ్వత రాజధాని గా చట్టం చేసినట్టే. దీనిని భవిష్యత్తులో ఎవ్వరూ మార్చలేరు. ఈ సందర్భంగా నిన్న ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి , ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అమరావతి క్యాపిటల్ కి ‘mavigun’ పేరు పెట్టమని సూచించాడు. మచిలీపట్టణం, విజయవాడ , గుంటూరు పరిసరాల్లో ఆ ఉంటుంది కాబట్టి , ఈ పేరు పెట్టడమే కరెక్ట్ అని ఆయన చెప్పుకొచ్చాడు.
దీనిపై సోషల్ మీడియా లో వచ్చిన ట్రోల్స్ మామూలువి కాదు. జగన్ మాట్లాడిన ఈ వీడియో ని వైరల్ చేస్తూ, అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి ?, ఈయన ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో అసలు అర్థం కావడం లేదంటూ కామెంట్స్ చేశారు. అంతే కాకుండా జగన్ స్టైల్ లోనే వివిధ ఊర్ల పేర్లల్లోని మొదటి అక్షరాలను తీసుకొని, విచిత్రమైన పదాలను తయారు చేసి జగన్ ని అడ్డమైన బూతులు తిడుతున్నారు నెటిజెన్స్. ఇదంతా పక్కన పెడితే ఈ ‘Mavigun’ అనే పేరు సోషల్ మీడియా అంతటా ఒక రేంజ్ లో వైరల్ అవ్వడం తో, ఈ టైటిల్ ని ఫిలిం ఛాంబర్ లో ఒక ప్రముఖ నిర్మాత రిజిస్టర్ చేసాడట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ టైటిల్ ని ఆయన ఏ ఉద్దేశ్యంతో రిజిస్టర్ చేసాడో చూడాలి.
Also Read: చిరంజీవి రాముడిగా కనిపించడానికి సిద్ధమవుతున్నాడా..?
జగన్ కి సపోర్టుగా సినిమా తీయడానికి ఈ టైటిల్ ని రిజిస్టర్ చేశారా ?, లేదంటే ఆయన మీద కామెడీ చేసే ఉద్దేశ్యంతో ఈ టైటిల్ ని ఖరారు చేశారా అనేది చూడాలి. యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఒక యంగ్ హీరో ఈ చిత్రం లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. చాలా మంది ఇందులో శ్రీవిష్ణు హీరో గా నటించబోతున్నాడని ప్రచారం చేస్తున్నారు. ఇందుల ఎంత వరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. డైరెక్టర్ కూడా అనుదీప్ కేవీ లాంటోళ్లను ఎంచుకునే అవకాశం ఉందట. వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అంటే కచ్చితంగా కామెడీ యాంగిల్ లోనే ఈ సినిమాని తీయబోతున్నారు అని అనుకోవచ్చు , చూడాలి మరి ఏమి జరగబొట్టునుండి అనేది.
