Homeఎంటర్టైన్మెంట్Matka King Web Series Review: 'మట్కా కింగ్' వెబ్ సిరీస్ రివ్యూ : ఇలాంటి...

Matka King Web Series Review: ‘మట్కా కింగ్’ వెబ్ సిరీస్ రివ్యూ : ఇలాంటి కాన్సెప్ట్ తో వెబ్ సిరీస్ అంటే సాహసమే..

Matka King Web Series Review: ప్రముఖ హీరోయిన్ తమన్నా(Tamanna Bhatia) మాజీ ప్రేమికుడు విజయ్ వర్మ(Vijay Varma) ప్రధాన పాత్ర పోషించిన ‘మట్కా కింగ్'(Matka King) అనే వెబ్ సిరీస్ రీసెంట్ గానే అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ మొదలైంది. విజయ్ వర్మ గతం లో మన టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘MCA’ చిత్రంలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎక్కువగా ఆయన హిందీ లోనే సినిమాలు , వెబ్ సిరీస్ లు చేస్తూ వచ్చాడు. తెలుగు, తమిళం , హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ ‘మట్కా కింగ్’ ఎలా ఉందో ఒకసారి ఈ రివ్యూ లో చూసి తెలుసుకుందాం.

కథ :

లాల్ జీ భాయ్(గుల్షన్ గ్రోవర్) అనే పేరు మోసిన వ్యాపారస్తుడు ముంబై లో ఉంటాడు. అతని కాటన్ మిల్లులో బ్రిజ్ భట్టి(విజయ్ వర్మ) పని చేస్తుంటాడు. ఈ బ్రిజ్ భట్టి కి లక్ష్మణ్ (భూపేంద్ర జాదవ్) అనే తమ్ముడు ఉంటాడు. ఇతను అల్లరి చిల్లరగా తిరిగే జల్సా రాయుడు. తన విలాసాల కోసం ఇష్టమొచ్చినట్టు అప్పులు చేస్తుంటాడు. ఒకరోజు లక్ష్మణ్ కి అప్పు ఇచ్చిన వ్యక్తి రౌడీలతో ఇంటికి వచ్చి దాడి చెయ్యాలని చూస్తాడు. అప్పుడు బ్రిజ్ భట్టి ఆ అప్పులను నేను తీరుస్తానని , నాకొక 10 రోజుల సమయం ఇవ్వమని కోరుతాడు. దీంతో ఆయన పని చేస్తున్న లాల్ జీ వద్ద అప్పు కోరుతాడు. లాల్ జీ అందుకు ఒప్పుకోడు. దీంతో అతని మిల్లు నుండి బయటకు వచ్చి , బ్రిజ్ భట్టి మట్కా వ్యాపారాన్ని మొదలు పెడుతాడు. అలా ఆ వ్యాపారం లో ముంబై లోనే అత్యంత ధనికుడిగా మారిపోతాడు. మరి ఆ స్థాయికి ఎదగడానికి బ్రిజ్ భట్టి ప్రయాణం లో ఎవరెవరు అండగా నిలిచాడు , తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా ఏలాడు అనేది తెలియాలంటే వెంటనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓపెన్ చేసి ఈ వెబ్ సిరీస్ ని చూసేయండి.

విశ్లేషణ :

ముంబై లోని పట్టి వ్యాపారి రవి ఖత్రి జీవితాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఇది. సాధారణంగా ఇలాంటి నిజ జీవితాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించే వెబ్ సిరీస్ / సినిమాల్లో వాస్తవాలకు సినిమాటిక్ లిబర్టీ ని జోడించి , కల్పితాలతో తెరకెక్కిస్తుంటారు. కానీ ఈ వెబ్ సిరీస్ కి డైరెక్టర్ డైరెక్టర్ నాగ రాజ్ కేవలం వాస్తవాలకే పెద్ద పీట వేశాడు. మీరు ఊహించుకున్నట్టు ట్విస్టులు, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు ఈ వెబ్ సిరీస్ లో ఉండవు. ఒక మెలో డ్రామాగా, ఫ్లో తో సాగిపోతూ ఉంటుంది. 1960 నుండి 70 దశకం నాటి పరిస్థితులను డైరెక్టర్ కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఉత్కంఠ కలిగే సన్నివేశాలు లేకపోయినా, ఆద్యంతం ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించాడు. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి 40 నిమిషాల వరకు ఉంటుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular