తమిళ్ స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్ కు ఈ రోజు పెద్ద పండుగే. విజయ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘మాస్టర్’. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయినా ఈ సినిమా ఎలా ఉంది ? అనే విషయాలను అనవసర వివరణలు, ఉపోద్ఘాతాలతో సాగదీయకుండా.. డైరెక్ట్ మ్యాటర్ లోకి వెళ్తే.. కేవలం విజయ్ ఫ్యాన్స్ ను టార్గెట్ గా ఈ సినిమాని తీశారు. ముందుగా కథ విషయానికొస్తే.. జేడీ (విజయ్) ఒక కాలేజీ ప్రొఫెసర్. ఇక ఆ కాలేజీ స్టూడెంట్స్ అంతా జేడీ ఫాలోవర్స్. అది కాలేజీ మేనేజ్మెంట్ కి నచ్చదు. దానికితోడు వ్యక్తిగతంగా కూడా జేడీ ఫుల్ గా తాగుతూ టైం పాస్ చేస్తుంటాడు. సినిమాలో మరో ట్రాక్ భవానీ(విజయ్ సేతుపతి)ది. రాక్షసుడుగా మారిన అతను పిల్లలను అడ్డు పెట్టుకుని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో జేడీ భవానీని ఏమి చేశాడు ? అనేది మిగిలిన కథ.
Also Read: ట్రైలర్ టాక్: ‘కపటధారి’ సుమంత్.. క్రైమ్ థిల్లర్
అయితే ఈ సినిమాకి వచ్చినంత హైప్, ఈ మధ్య కాలంలో మరే డబ్బింగ్ సినిమాల్లో దేనికి రాలేదు. మరి భారీ అంచనాల మధ్య పక్కా మాస్ మసాలా అంశాలతో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మొత్తానికి మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నా.. మిగిలిన ప్రేక్షకులకు అస్సలు నచ్చదు. కాకపోతే విజయ్ డైలాగ్ డెలివరీ, మరియు ఫుల్ ఎనర్జీతో సాగే విజయ్ యాక్టింగ్ అండ్ స్టెప్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.ముఖ్యంగా ఈ సినిమా కోసం విజయ్ పెట్టిన ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి.
Also Read: సింగర్ సునీతకి అండగా నిలబడిన మెగా బ్రదర్
అలాగే విలన్ క్యారెక్టర్ లో విజయ్ సేతుపతి చక్కని నటనను కనబరిచాడు. గత సినిమాల్లో కంటే, ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటన చాల కొత్తగా ఉంటుంది. మెయిన్ గా సినిమాలో అక్కడక్కడా నవ్విస్తూనే, ఇటు హై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. మొత్తానికి సినిమా మాస్ ప్రేక్షకులకు నచ్చుతుంది. కానీ, మంచి స్టోరీ లైన్ ను అలాగే మంచి క్యారెక్టర్ ను రాసుకున్నప్పటికీ, ఆ లైన్ ను ఆ క్యారెక్టర్ కి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. పైగా సెకెండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు మరి స్లోగా సాగుతాయి. సినిమాలో కీలక సన్నివేశాలకు సరైనా లాజిక్ ఉండడు. పైగా ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా అసలు కనెక్ట్ కాదు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్