Saindhav: వెంకటేష్ కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది సైంధవ్. వెంకటేష్ 75వ చిత్రం ఇది. పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్స్ లోకి రానుంది. కాగా సైంధవ్ ప్రొమోషన్స్ విరివిగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సైంధవ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సైంధవ్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రంలో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని అర్థం అవుతుంది.
సైంధవ్ ట్రైలర్ అంచనాలు పెంచేసింది. అదే సమయంలో ట్రోల్స్ కి గురవుతుంది. ట్రైలర్ లో ఓ షాట్ లో వెంకటేష్ వ్యక్తిని గన్ తో కాల్చి చంపుతాడు. నోట్లో గన్ పెట్టి కాల్చితే బుల్లెట్ మల ద్వారం నుండి బయటకు వచ్చినట్లు చూపించారు. తెలుగు సినిమాలో ఈ తరహా వైలెంట్ షాట్ పెట్టింది లేదు. ఇది జనాలను ఆకర్షించింది. అదే సమయంలో విమర్శలకు గురవుతుంది.
ఈ షాట్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. హీరో క్యారెక్టర్ ఎంత వైల్డ్ గా ఉంటుందో? వైలెన్స్ పాళ్ళు ఎంతగా ఉంటుందో? చెప్పేందుకు ట్రైలర్ లో చూపించిన ఈ ఫైరింగ్ సీన్ నిదర్శనం. అయితే కొందరు ఈ షాట్ ని ట్రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. సైంధవ్ యాక్షన్ అండ్ ఎమోషన్ కలగలిపి తెరకెక్కించారు.
కూతురు అరుదైన వ్యాధి బారిన పడుతుంది. ఆమెను కాపాడుకోవాలంటే రూ. 17 కోట్ల విలువైన మెడిసిన్ కావాలి. కన్న బిడ్డను కాపాడుకునేందుకు మిడిల్ క్లాస్ ఫాదర్ చేసిన యుద్ధమే సైంధవ్ మూవీ. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకుడు. ఆయన గతంలో హిట్, హిట్ 2 అనే క్రైమ్ థ్రిల్లర్స్ తెరకెక్కించారు. సైంధవ్ లో ఆర్య, ఆండ్రియా, జిషు సేన్ గుప్త, శ్రద్దా శ్రీనాథ్ కీలక రోల్స్ చేశారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఫస్ట్ టైం తెలుగులో నటిస్తున్నాడు..
Journey of Bullet Ft.#Saindhav @KolanuSailesh @VenkyMama pic.twitter.com/D5K8pJxAtk
— Hyderabad Hawaaa (@tweetsraww) January 3, 2024