Mass Jathara Movie First Movie Review: మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర'(Mass Jathara Movie). ‘ధమాకా’ తర్వాత వరుసగా ఆరు డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకున్న రవితేజ,ఈ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పాటలు ప్రతీ ఒక్కటి ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచాయి. వింటేజ్ రవితేజ ని డైరెక్టర్ మళ్లీ బయటకు తీసుకొచ్చాడు అనే ఫీలింగ్ ని రప్పించాయి. ఇప్పుడు ఫ్యాన్స్ మొత్తం థియేట్రికల్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ట్రైలర్ కూడా అద్భుతంగా వచ్చిందని, సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా చేస్తుందని టాక్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ సిద్ధమైంది. నిన్న హీరో రవితేజ తో పాటు మూవీ టీం మరియు కొంతమంది మీడియా ప్రముఖులకు ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సినిమాకు ప్రివ్యూ షో ని ఏర్పాటు చేశారు.
ఈ షో నుండి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇడియట్ లోని రవితేజ ని గుర్తు చేసే విధంగా అల్లరి అల్లరిగా సాగిపోతుందని, ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రప్పించే సన్నివేశాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఇచ్చిన ఊపు తో సెకండ్ హాఫ్ కూడా మొదలు అవుతుందని. సెకండ్ హాఫ్ ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఎలివేషన్ సన్నివేశాలతో ఫ్యాన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ కూడా మెంటలెక్కిపోయే రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. డైరెక్టర్ భాను కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ కూడా, ఎక్కడా అనుభవం లేమి కనిపించదట. ఇండస్ట్రీ కి రవితేజ ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ని పరిచయం చేసాడు, వారిలో భాను కూడా ఒకడిగా చేరిపోతాడు అనడంలో ఎలాంటి సందేహం.
ఈ సినిమాలో రవితేజ లోని కామెడీ యాంగిల్ ని చూపిస్తూనే, విక్రమార్కుడు, క్రాక్ తరహా మాస్ హీరోయిజం ని కూడా చూపిస్తూ, చాలా పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేసాడట డైరెక్టర్. వరుసగా ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ వస్తున్న నిర్మాత నాగవంశీ కి ఈ చిత్రం కచ్చితంగా పెద్ద కమర్షియల్ హిట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ ఏడాది ఆరంభం లో వరుసగా ఫ్లాప్స్ వచ్చినప్పటికీ, సెప్టెంబర్ నుండి మన టాలీవుడ్ కి మంచి రోజులు మొదలయ్యాయి. దానిని ‘మాస్ జాతర’ చిత్రం కొనసాగిస్తూ ముందుకు వెళ్తుందని చాలా బలమైన నమ్మకం తో చెప్తున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.