Mass Jathara 2 days Collections: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతోంది. మన సినిమాలను మించిన సినిమాలు చేసే ఇండస్ట్రీ మరేది లేకపోవడంతో ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి గొప్ప గౌరవమైతే దక్కుతోంది. బాహుబలి, త్రిబుల్ ఆర్, పుష్ప, సలార్ సినిమాలతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన మనవాళ్లు ఇక మీదట రాబోయే సినిమాలను కూడా ఆ రేంజ్ లోనే తీయాలని ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది హీరోలు రొటీన్ కమర్షియల్ సినిమాలను చేసి తెలుగు సినిమా స్థాయిని దిగజారుస్తున్నారు అంటూ కొంతమంది సినిమా మేధావులు కామెంట్లు చేస్తున్నారు. రవితేజ ప్రస్తుతం రొటీన్ రొట్ట కామెడీ కమర్షియల్ సినిమాలను చేస్తున్నాడు. అందులో మాస్ జాతర కూడా ఒకటి కావడం విశేషం…రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజు 6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి ఇక రెండోవ రోజు ఆ కలెక్షన్స్ భారీగా డౌన్ అయిపోయాయి.
మొదటి రోజే ఈ మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకోవడం తో ఈ సినిమా ప్రస్తుతం ప్లాప్ టాక్ తో ముందుకు సాగుతోంది… రిలీజ్ కి ముందే 20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ ను జరుపుకున్న ఈ సినిమా ఇప్పటివరకు 9 కోట్ల కలెక్షన్స్ ని మాత్రమే రాబట్టింది. ఇక వీకెండ్స్ లో కూడా ఇంతటి తక్కువ కలెక్షన్స్ వచ్చాయి అంటే మూడో రోజు నుంచి ఈ కలెక్షన్స్ మరింత డౌన్ అయిపోయాయే అవకాశాలైతే ఉన్నాయి.
ఓవరాల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 11 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టాల్సిన అవసరమైతే ఉంది. మరి ఆ కలెక్షన్స్ ని రాబట్టి బ్రేక్ ఈవెన్ గా నిలుస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సిచువేషన్ ని చూస్తే ఈ సినిమాకి 20 కోట్ల కలెక్షన్స్ రావడం అనేది చాలా కష్టం తో కూడుకున్న పని…
20 కోట్లు కూడా వసూలు చేయలేకపోతే మాత్రం డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది… రవితేజ ఇప్పటికైనా మేల్కొని కొంచెం ప్రస్తుతం ఉన్న ట్రెండుకు తగ్గట్టు సినిమాలు చేస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…