Mask Man Harish hunger strike: అగ్నిపరీక్ష షో నుండి, బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి అడుగుపెట్టేంత వరకు ఇప్పటి వరకు మాస్క్ మ్యాన్ చూపించిన షేడ్స్ ని చూసి ఆడియన్స్ కి ఎంత చిరాకు కలిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతని మీద ఇతను వేసుకునే ఎలివేషన్స్, సంబంధం లేకుండా తనూజ, భరణి మీద ద్వేషం పెంచుకునే తత్త్వం ఇప్పటికీ ఏ మాత్రం మారలేదు. ఆడవాళ్లు ఇతనికి బలంగా మాట్లాడితే అసలు నచ్చదేమో, అగ్నిపరీక్ష షోలో దీనిని బిందు మాధవి కూడా పసిగట్టింది. మార్చుకుంటాడేమో అని అనుకోని నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున అంత మంచిగా చెప్తే, బిగ్ బాస్ టీం తనని కావాలని నెగిటివ్ చేస్తుంది అనే మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయాడు. నిన్న నాగార్జున ముందు కూడా ఇదే మాట్లాడుతాడు. ఇప్పుడు ఆయన అసలు రంగు జనాలు మొత్తం చూడడంతో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లిపోవాలని చూస్తున్నాడు.
అందుకు ఆయన అన్నం, నీళ్లు తీసుకోకుండా నిరాహార దీక్ష చేస్తున్నాడు. కాసేపటి క్రితమే ఒక ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో లో శ్రీజా హరీష్ కోసం అన్నం తీసుకొని వస్తే, ‘నేను బిగ్ బాస్ హౌస్ ని వదిలి వెళ్లేంత వరకు అన్నం నీళ్లు తీసుకొని. మీలాంటి వాళ్ళు ఉన్న చోట నేను అసలు అన్నం తినను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఎంతో మర్యాదగా అతని కోసం అన్నం కలుపుకొని తీసుకొస్తే ఇంత అవమానకరంగా మాట్లాడడం వంటివి ఈ ప్రపంచం మాస్క్ మ్యాన్ మాత్రమే చేయగలడేమో. అసలు ఇతను ఎక్కడి నుండి వచ్చాడు?, ఇతని కుటుంబ సభ్యులు ఎలా భరిస్తున్నారు?, వారం రోజులు ఇతన్ని చూసినందుకు ఆడియన్స్ కి బుర్ర చెడిపోయినట్టు అయిపోయింది. అలాంటిది ఇతను సమాజం లో ఎలా బ్రతుకుతున్నాడు, జనాలు ఇతన్ని ఎలా భరిస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
సరదాగా సంజన చేసిన ఒక తప్పు కి ఆమె ని ఒక క్రిమినల్ లాగా చేసి చూపించే ప్రయత్నం ఇప్పటికీ మానుకోలేదు మాస్క్ మ్యాన్ హరీష్. ఆమె ఓనర్ గా మాత్రమే కాదు, కంటెస్టెంట్ గా కూడా అర్హురాలు కాదు అంటూ ఫ్లోరా తో చెప్పుకొచ్చాడు. నిన్న సంజన వద్దకు వెళ్లి మీ బ్యాగ్స్ ని ప్యాక్ చేసుకోండి, హ్యాపీ జర్నీ అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే మాట సంజన హరీష్ ని అనుంటే తీసుకునేవాడా?, ఇల్లు పీకి పందిరి చేసేవాడు. ఇప్పుడు నాగార్జున చేసిన తప్పులను వీకెండ్ లో చూపించి, మార్చుకోరా బాబు అంటే నేను ఇంటి నుండి వెళ్ళిపోతే అంటున్నాడు. అంటే ఇతన్ని ఇంట్లో ఉంచడానికి, ఇతను ఇంట్లో ఫుడ్ తినడానికి స్వయంగా నాగార్జున వచ్చి క్షమాపణలు చెప్పాలా?, చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఇంతటి బలుపు ఉన్న క్యారక్టర్ ని మనం జీవితం లో మళ్లీ చూడలేం ఏమో.
