Bigg Boss 9 Telugu: మాస్క్ మ్యాన్ హరీష్ ప్రతీ ఎపిసోడ్ కి తనలోని కొత్త యాంగిల్ ని పరిచయం చేస్తూ హౌస్ లో ఉన్నవాళ్లకు పిచ్చి ఎక్కించి , చూసే ప్రేక్షకులకు జుట్టు పీక్కునేలా చేస్తున్నాడు. ఇతను కంటెస్టెంట్స్ తో ఎప్పుడు జోకులు వేస్తాడో, ఎప్పుడు సీరియస్ గా ఉంటాడో, ఎప్పుడు కోపం తెచుకుంటాడో, ఎప్పుడు అలుగుతాడో అతనికి కూడా తెలియదు. ప్రతీ అంశం లోను తనకు తానూ భీభత్సమైన ఎలివేషన్ వేసుకుంటాడు. రూల్స్ చాలా గొప్పగా మాట్లాడుతాడు, తనని మించిన మానవతా వాది ఎవ్వరూ లేరు అనేంత బిల్డప్ ఇస్తాడు. కానీ ఆయన ఇచ్చే బిల్డప్ కి చేసే పనులకు అసలు పొంతన ఉండడం లేదు. ముఖ్యంగా ఇతను ఇమ్మానుయేల్ మరియు భరణి లపై పీకలదాకా కోపం పెంచుకున్నాడు. వాళ్ళ మీద అకారణంగా నోరు పారేసుకుంటూ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నాడు. తాను ఎలాంటి సందర్భం వచ్చినా నోరు జారను అంటూ చెప్పుకొచ్చే మాస్క్ మ్యాన్, నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) చరిత్రలో ఏ కంటెస్టెంట్ జారని రేంజ్ లో భరణి, ఇమ్మానుయేల్ పై జారాడు.
Also Read: అప్పట్లో ‘కాంతారా’ ని ఎవ్వరూ కొనలేదు..ఇప్పుడు ‘కాంతారా 2’ ఎంతకి అమ్ముడుపోయిందంటే!
ఇన్ని రోజులు నేను తనూజ, భరణి మరియు ఇమ్మానుయేల్ లో తనూజ ఒక్కటే అమ్మాయి అనుకున్నాను, మిగిలిన ఇద్దరు కూడా అమ్మాయిలే అంటూ చెప్పుకొచ్చాడు. అంటే ఏంటి ఇతని ఉద్దేశ్యం?, అంటే అమ్మాయి తో పోల్చి వెటకారం చేస్తున్నాడంటే ఇతని దృష్టిలో అమ్మాయి అంత చులకన అపోయిందా?, బిందు మాధవి ఇతన్ని ఊరికే తిట్టలేదు అంటూ మనకి కచ్చితంగా ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది. రెండు రోజుల క్రితమే ఇమ్మానుయేల్ సరదా గా మాస్క్ మ్యాన్ ని గుండు మ్యాన్ అని పిలుస్తాడు. దానికి మాస్క్ మ్యాన్ హరీష్ చాలా ఫీల్ అయిపోయి, ఇమ్మానుయేల్ ని బాడీ షేమింగ్ చేస్తున్నావు అంటూ పెద్ద రచ్చ చేసాడు. కానీ ఈరోజు ఈ పెద్ద మనిషి మాస్క్ మ్యాన్ చేసింది కూడా అదే.
అసలు కెప్టెన్సీ రేస్ నుండి అన్యాయంగా తొలగిపోయాను అనే బాధతో ఆయన ఒక మూల కూర్చొని ఉన్న ఇమ్మానుయేల్ ని వెక్కిరిస్తూ మాస్క్ మ్యాన్ హరీష్ ఒక మ్యానరిజం చేస్తాడు. ఇది అసలు సిసలు బాడీ షేమింగ్ అంటే. ఇమ్మానుయేల్ సంగతి పక్కన పెడితే నిన్న తన తరుపున ఆడిన పవన్ కళ్యాణ్ చిన్న మిస్తకె చేస్తే చెప్పి ఆట నుండి తొలగించింనందుకు భరణి మీద పగబట్టేసాడు. హౌస్ లో అందరికి అతని పై లేని పోనీ చాడీలు చెప్పడమే కాకుండా, భరణి ని నేరుగా అవమానించడం వంటివి చేసాడు. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత భరణి గుడ్ మార్నింగ్ చెప్తే మాస్క్ మ్యాన్ హరీష్ సమాధానం చెప్పకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు ఏమి చూసుకొని ఇంత పొగరు? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.