Maruti Shocking Comments On Rajasaab: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీని తారాస్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మారుతి లాంటి చిన్న సినిమాలు చేసుకునే దర్శకుడు కూడా ఇప్పుడు ప్రభాస్ తో రాజాసాబ్ (Rajaasaab) సినిమా చేశాడు. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ వేడుకలో దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు… ఆయన ఈ మూవీ గురించి మాట్లాడుతూ మొదట ఈ సినిమాను వేరే ప్రొడ్యూసర్లు తమ బ్యానర్ లో చేస్తామని చెప్పారు. కానీ మా కాంబినేషన్ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడంతో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించుకున్నారని చెప్పాడు. ఇంకా మారుతి మాట్లాడుతూ ఆ ప్రొడ్యూసర్స్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత టీజీ విశ్వ ప్రసాద్ మా ఇద్దరి కాంబినేషన్ ను నమ్మి మాతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే సినిమా స్టార్ట్ చేసే సమయం లో నేను ప్రభాస్ ను హ్యాండిల్ చేయగలనా అనే డౌట్ అయితే నాకు వచ్చిందని చెప్పరు.
ఆల్రెడీ తన మార్కెట్ తారస్థాయిలో ఉంది. తనతో సినిమా చేయడం వల్ల ప్రభాస్ ఇమేజ్ పడిపోతుందేమో అనే ఒక డిప్రెషన్ లో నేను ఉన్నప్పుడు నాకు ప్రభాస్ ధైర్యం చెప్పి ఒక మంచి క్యారెక్టర్ ని క్రియేట్ చెయ్ దాని ద్వారా మనం కామెడీని పండిద్దాం అని చెప్పారట.
Also Read: Prabhas Warning To Director: సెట్ లో ఆ స్టార్ డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చిన ప్రభాస్, కారణం ఇదే!
ఇక అప్పుడు ప్రభాస్ (Prabhas) తనని భారీగా నమ్ముతున్నాడని ఇలాంటి సందర్భంలో మనం కూడా మనల్ని నమ్మి సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ కథ రాయడానికి ఒంటరిగా కూర్చుని ఆలోచించారట. మొదట్లో ఆలోచనలను పెద్దగా రాలేదట. కానీ కొద్ది రోజుల తర్వాత ఆయనకు రాజాసాబ్ సినిమా కథ దొరికింది.
ఇక ఆ తర్వాత ప్రభాస్ కి ఆ కథను వినిపించి ఓకే చేయించుకున్నాడు మొత్తానికైతే ఈ సినిమా కోసం మారుతి పడిన కష్టాన్ని టీజర్ వేడుకలో చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఇక ఏది ఏమైనా కూడా డిసెంబర్ 5వ తేదీన రాబోతున్న ఈ సినిమా మీద ప్రభాస్ అభిమానులు ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి ఈ సినిమా దానికి మించి ఉంటుంది అంటూ మారుతి ప్రభాస్ అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు…