Maruthi : సినిమా ఇండస్ట్రీ లో హిట్టు వచ్చినప్పుడు పొంగిపోకుండా, ప్లాప్ వచ్చినప్పుడు కృంగిపోకుండా దర్శకుడు ఏదైతే నమ్మాడో దాన్ని తీసుకుంటూ ముందుకు సాగినప్పుడే ఆయన ఇండస్ట్రీ లో సర్వవైల్ అవ్వగలుగుతాడు అనేది వాస్తవం…ఇక ఇలాంటి క్రమంలోనే దర్శకుడు మారుతి ప్రస్తుతం ప్రభాస్ తో ‘రాజాసాబ్’ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఆయన ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక రీసెంట్ గా మారుతి ప్రొడక్ట్స్ నుంచి ‘బ్యూటీ’ అనే సినిమా రిలీజ్ కి రెడీ అయింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. ఇక ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ సినిమాలు ఆడిన, ఆడకపోయిన ఎవరు టెన్షన్ పడద్దు. మంచి కథతో వచ్చినప్పుడు సినిమాలు ఆడుతాయి. రీసెంట్ గా ‘త్రిబాణాదారి భార్బరిక్’ సినిమా దర్శకుడు అయిన ‘మోహన్ శ్రీవాత్సవ్’ సినిమా సరిగా ఆడడం లేదని చెప్పుతో కొట్టుకొన్నాడు. ఇక దాన్ని వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాని వల్ల చాలా మంది నుంచి అతనికి సింపతి అయితే వచ్చింది. కానీ సినిమా అయితే పెద్దగా ఆడలేదు. ఇలాంటి పిచ్చి పనులు చేయడం వల్ల వచ్చేది ఏమీ ఉండదు.
ఇక ఆ యువత మళ్ళీ ఆయన రియలైజ్ అయి అందరికి సారీ చెప్పాడు. నిజానికి ఒక సినిమా వల్ల ఏం జరిగింది, మనం ఏం నేర్చుకున్నాం అనేది తెలుసుకుని నెక్స్ట్ సినిమాలో అలాంటి తప్పులు చేయకుండా ముందుకు సాగితే మంచిదనే మాట చెప్పాడు. అయితే మారుతి ఈ సినిమాకి ప్రజెంటర్ గా వ్యవహరించడం విశేషం… ఇక భార్భరిక్ అనే టైటిల్లో విషయంలో కూడా మారుతి చాలాసార్లు ఆ టైటిల్ మార్చమని దర్శకుడుతో చెప్పారట.
చాలాసార్లు వేరే టైటిల్స్ ని కూడా తనకు మెసేజ్ చేశాడని అయినప్పటికి మోహన్ వినకపోవడంతో ఒక డైరెక్టర్ ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను వదిలేశాను… ఆయన ఆ టైటిల్ విషయంలో ఒక ట్రాన్స్ లో ఉన్నాడని అతను ఆ టైటిల్ కి చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడని మారుతి చెప్పాడు. నిజానికి భార్భరిక్ అనే ఒక వ్యక్తిని హీరోగా చూపించాలనుకున్నాడు.
కానీ పురాణాల్లో ఆయన ఉన్నాడనే విషయం కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి అది ఎక్కువ మందికి కనెక్ట్ అవ్వదనే ఉద్దేశ్యంతో నేను టైటిల్ మార్చమని చెప్పినప్పటికి ఆయన వినలేదు. ఇండస్ట్రీ లో ఏది జరిగిన అది మన మంచికే అనుకొని ముందుకు సాగాలి తప్ప డిప్రెషన్ లోకి వెళ్లి ఇలాంటి వీడియోలు పెట్టడం వల్ల ఎవరికి ఏమి రాదు అంటూ మారుతి కొన్ని కామెంట్స్ అయితే చేశాడు…