నటీనటులు : తనీష్, ముస్కాన్ సేథీ , భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర తదితరులు
దర్శకత్వం: జాని
సంగీతం : సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫీ :ఎంఎన్ బాల్ రెడ్డి
ఎడిటింగ్: క్రాంతి (ఆర్కే),
నిర్మాత : ఉదయ్ కిరణ్
తనీష్ హీరోగా నటించిన కొత్త సినిమా మహాప్రస్థానం. ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహించాడు. ముస్కాన్ సేథీ నాయికగా నటించింది. మరో కీలక పాత్రలో వరుడు ఫేమ్ భాను శ్రీ మెహ్రా కనిపించింది. కాగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ చూద్దాం.
కథ :
రాణే భాయ్ (కబీర్ సింగ్ దుహాన్) అనే గ్యాంగ్ లీడర్ కి శివ (తనీష్) రైట్ హ్యాండ్. క్రిమినల్ అయిన శివ నైనితో (అర్చనా ఖన్నా) ప్రేమలో పడతాడు. నైనిని పెళ్లి చేసుకుంటాడు. కానీ తానూ క్రిమినల్ అనే సంగతి ఆమెకు చెప్పడు. అయితే, ఇక నుంచి క్రైమ్ మానేసి.. తన భార్యతో గోవాలో సెటిల్ అవుదామని శివ ప్లాన్ చేసుకుని వస్తాడు. కానీ శివ తిరిగి వచ్చాక అతనికి ఓ డెడ్ బాడీ కనిపిస్తోంది. దాంతో అతనిలో మార్పు వస్తోంది.
ఇక అప్పటి నుంచి తన గ్యాంగ్ సీక్రెట్స్ లీక్ చేస్తూ.. ఆ క్రమంలో తన గ్యాంగ్ లోని వ్యక్తులనే చంపేస్తూ ఉంటాడు. అసలు శివలో మార్పు రావడానికి కారణం ఏమిటి ? తన గ్యాంగ్ ప్లాన్ చేసిన బ్లాస్ట్ లను శివ ఎలా ఆపాడు ? ఈ మధ్యలో జర్నలిస్ట్ సమీర (భాను శ్రీ మెహ్రా)కి ఈ గ్యాంగ్ కి మధ్య సంబంధం ఏమిటి ? ఆమెను ఎందుకు టార్చర్ పెడుతూ ఉంటారు ? చివరకు శివ అనుకున్నది సాధించాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
గ్యాంగ్ స్టర్ గా ఈ సినిమాలో తనీష్ పవర్ ఫుల్ పాత్రలో తన టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే, తనీష్ బాడీ లాంగ్వేజ్ కి, అతని పాత్ర సెట్ కాలేదు. డామినేట్ చేసే క్యారెక్టరైజేషన్ మాడ్యులేషన్ తో తన పాత్రకు తనీష్ నటన పరంగా పర్ఫెక్ట్ న్యాయం చేసినా.. ఫిజిక్ పరంగా తేలిపోయాడు.
ఇక హీరోయిన్ పాత్రలో ఓకే ఎమోషన్ తో సాగే అర్చనా ఖన్నా నటన కూడా పరవాలేదనిపిస్తుంది. అలాగే హీరోతో సాగే ఆమె భావోద్వేగ సీన్స్ బాగున్నాయి. విలన్ పాత్రలో నటించిన నటుడు కబీర్ సింగ్ దుహాన్ ఆ పాత్రకు తగ్గట్లు తన లుక్స్ ను తన ఫిజిక్ ను చాలా బాగా మార్చుకున్నాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
అయితే, ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ వైవిధ్యమైనా.. ఇంట్రస్ట్ గా సాగదు. మంచి కథా నేపథ్యం రాసుకున్నప్పటికీ ఆసక్తికరమైన కథనంతో సినిమాని ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయారు. ఈ చిత్రం చూస్తున్నంత సేపు రెగ్యులర్ క్రైమ్ డ్రామాలు గుర్తుకు వస్తాయి. అన్నిటికీ మించి సినిమాలో గుర్తు ఉండిపోయే ఒక్క ఎమోషన్ కూడా బలంగా ఎలివేట్ కాలేదు.
ప్లస్ పాయింట్స్ :
తనీష్ నటన,
నేపథ్య సంగీతం,
కథా నేపథ్యం
కొన్ని క్రైమ్ సీన్స్,
ఇంటర్వెల్ కి వచ్చే ట్విస్ట్.
మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్ క్రైమ్ ప్లే,
రొటీన్ యాక్షన్ డ్రామా,
హీరో ఓవర్ బిల్డప్,
లాజిక్స్ మిస్ అవ్వడం,
బోరింగ్ ట్రీట్మెంట్,
కెమరా వర్క్,
సినిమా చూడాలా ? వద్దా ?
మొత్తంగా సింగిల్ షాట్‌లో తీసిన ఈ ‘మరో ప్రస్థానం’ రొటీన్ క్రైమ్ డ్రామా వ్యవహారాలతోనే సాగుతుంది. కాకపోతే కొన్ని క్రైమ్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. కానీ, ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించదు.
రేటింగ్ : 2