Mani Sharma Mother Passed Away: తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణంరాజు కాలం చెందారు. ఐతే, ఈ విషాదాన్ని ఇంకా మరువకముందే సంగీత దర్శకుడు మణిశర్మ తల్లి గారు మనమండ్ర సరస్వతి కూడా మరణించిండం బాధాకరమైన విషయం. గత కొన్నిరోజులుగా వయో వృద్ధ సమస్యలతో సరస్వతి గారు బాధపడుతున్నారు. ఆమె వయస్సు 88 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా చెన్నైలో చికిత్స పొందుతూ వస్తున్న ఆమె నిన్న మృతి చెందారు.

ఆమె మరణవార్తతో మణిశర్మ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మణిశర్మ తల్లి మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు. మణిశర్మ గారు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అద్భుతమైన సంగీతాన్ని అందించారు అంటే.. కారణం మనమండ్ర సరస్వతి గారే.
ఆమె మణిశర్మకు చిన్న తనం నుంచి సంగీతాన్ని నేర్పించారు. అలాంటి ఆమె తుదిశ్వాస విడవడం మణిశర్మ సన్నిహితులను తీవ్రంగా కలిచివేసింది. ఇక ఈ రోజు సాయంత్రం మనమండ్ర సరస్వతి గారి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఇక సరస్వతి గారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మా ‘ఓకేతెలుగు’ ఛానెల్ తరఫున సరస్వతి గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.