Manishankar Movie: శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్దే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “మణిశంకర్”. చాణక్య ఈ సినిమాలో ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ అండ్ డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం జి. వెంకట కృష్ణన్ అండిచడం మరో ప్రేత్యేక ఆకర్షణ అని చెప్పాలి.

కాగా కె.ఎస్. శంకర్రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ ఈ చిత్రానికి నిర్మాతలుగా చేస్తున్నారు. వీరు ముగ్గురు కలిసి లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు `మణిశంకర్` టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ని చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ పోస్టర్ లో చుట్టూ కత్తులతో శివ కంఠమనేని ఉండగా… సీరియస్ లుక్ లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ సంధర్భంగా మూవీ యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. మా “మణిశంకర్” ఫస్ట్‌లుక్ మోషన్‌పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది… సంజన గల్రాని, ప్రియా హెగ్దేలతో కలిసి పని చేయడం చాలా హ్యాపీగా ఉందని హీరో శివ అన్నారు. ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా తప్పకుండ ప్రేక్షకులను లరిస్తుందని చెప్పారు. మాణిక్య రెడ్డి, సుబ్బరాజ్ శర్మ, అరోహి నాయుడు, నెల్లూరు సుబ్బు , పలువురు నటీనటులు సినిమాలో ఉన్నారు.