https://oktelugu.com/

Mangalavaaram OTT: మంగళవారం మూవీ ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎందులో ప్రసారమంటే..?

ముఖ్యంగా సస్పెస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని చూడటానికి ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తిని చూపించారు. ఇక అందులో భాగంగా ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో ప్రస్తుతం ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడు అనేదానిమీద చాలా రకాలైన చర్చలు నడుస్తున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : December 10, 2023 / 01:51 PM IST

    Mangalavaaram OTT

    Follow us on

    Mangalavaaram OTT: ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగులో తనదైన మార్క్ గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అజయ్ భూపతి.ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఒక కల్ట్ క్లాసికల్ మూవీగా నిలిచిపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇక ఈ సినిమాతో హీరో కార్తికేయ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వగా, పాయల్ రాజ్ పుత్ కూడా ఈ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి చేసిన మహాసముద్రం సినిమా పెద్దగా ఆడకపోయిన ఆయన చేసిన మంగళవారం సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకుంది.ఇక రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ అయి థియేటర్ లో ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేసింది.

    ముఖ్యంగా సస్పెస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని చూడటానికి ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తిని చూపించారు. ఇక అందులో భాగంగా ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో ప్రస్తుతం ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడు అనేదానిమీద చాలా రకాలైన చర్చలు నడుస్తున్నాయి. ఇక ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది అనే విషయం తెలుస్తుంది. అయితే ఈ విషయం మీద మంగళవారం టీం గానీ అటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు గాని ఎవరూ కూడా ఇంతవరకు అధికారిక ప్రకటన అయితే చేయలేదు…

    ఇక ఇదే సమయంలో మంగళవారం తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ ఆహా ఓటిటి ప్లాట్ఫారంలో జరగనున్నట్టుగా మరికొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక తెలుగు వర్షన్ వరకు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది అన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. కానీ దీని మీద కూడా అధికారిక ప్రకటన అయితే చేయలేదు…ఇక దాంతో మంగళవారం సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు అనే దాని మీద ఆ సినిమా అభిమానులు సోషల్ మీడియాలో భారీ ఎత్తున మంగళవారం సినిమా ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడు అనే ఒక న్యూస్ ని వైరల్ చేస్తున్నారు…థియేటర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఓటిటిలో ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

    ఇక ఈ నెలలోనే ఈ సినిమా ఓటిటి రిలీజ్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది…ఈ సినిమా తో పా రాజ్ పుత్ అయితే ఒక మంచి హిట్ కొట్టింది దాంతో ఇప్పుడు ఈమె కి చాలా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి…