
బాలీవుడ్ సీనియర్ బ్యూటీ ‘మందిరా బేడీ’ తన భర్త ‘దర్శకుడు రాజ్ కౌశల్’ చనిపోయిన దగ్గర నుండి.. ఆమె తీవ్రమైన విషాదంలోనే ఉన్నారు. అయితే, రోజులు గడుస్తున్నా ఆమె మాత్రం ప్రతి రోజూ తన భర్తను తల్చుకుని తీవ్ర భావోద్వేగానికి గురి అవుతున్నారు. దర్శకుడు రాజ్ కౌశల్ జూన్ 30న గుండెపోటుతో మరణించారు. అయితే, ఈ రోజు రాజ్ కౌశల్ జయంతి.
ఈ సందర్భంగా తన భర్తను స్మరించుకున్న మందిరా ఒక ఫోటోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఒక ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేస్తూ… ‘ఆగస్టు 15 ఎప్పుడు వచ్చినా నాకు ప్రత్యేకంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు రాజ్ పుట్టిరోజు కూడా. తను నా జీవితంలోకి వచ్చిన ప్రతి క్షణాన్ని నేను వేడుక చేసుకున్నాను.
మందిరా భర్తను తల్చుకుని కారుతున్న కన్నీళ్లను ఆపుకుంటూ.. ‘హ్యాపీ బర్త్‌డే రాజీ, మేము అంతా నిన్ను ఎంతో మిస్ అవుతున్నాం. నేను బలంగా నమ్ముతున్నాను. నువ్వు మమ్మల్ని చూస్తున్నావని. నువ్వు లేని ఈ శూన్యతను ఎన్నటికీ ఎవరు పూరించలేరు. నాకు నువ్వంటే అంత ఇష్టం. ఎందుకంటే.. మరచిపోవడానికి నువ్వు జ్ఞాపకం కాదు.. నా జీవితం’ అంటూ మందిరా బేడీ హెవీ ఎమోషనల్ అవుతూ మెసేజ్ పోస్ట్ చేశారు.
మందిరా బేడీ ఇంత ఎమోషనల్ అవ్వడానికి కారణం… రాజ్ కౌశల్ ఆమెకు గొప్ప ప్రేమను అందించారు. మందిరా బేడీ, రాజ్ కౌశల్ ది ప్రేమ వివాహం. నటిగా అవకాశాలు ఇవ్వడంతో పాటు ఆమె కెరీర్ లో ఎదగడానికి రాజ్ కౌశల్ ఎంతో చేశారు. అందుకే, మందిరా బేడీ.. రాజ్ కౌశల్ ను ప్రాణంగా ప్రేమించింది. 1999లో వీరిద్దరు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.