Manchu Vishnu Kannappa Movie : మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప'(Kannappa Movie) రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా నేడు మంచు విష్ణు కాసేపటి క్రితమే ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన విలేఖరులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఈ ప్రెస్ మీట్ లో మంచు విష్ణు తో పాటు నటుడు శివబాలాజీ, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్,డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. అయితే రెండు రోజుల క్రితం మంచు విష్ణు సోషల్ మీడియా లో క్రిటిక్స్ కి వార్నింగ్ ఇస్తూ ఒక లేఖని విడుదల చేసిన సంగతి తెలిసిందే. పనిగట్టుకొని , దురుద్దేశంతో మా సినిమాపై నెగటివ్ రివ్యూస్ రాస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ వార్నింగ్ ఇస్తాడు.
దీనిపై విలేఖరి మంచు విష్ణు ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు ఈమధ్యనే సోషల్ మీడియా లో నెగటివ్ రివ్యూస్ రాసే వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. అది మాలాంటి సాధారణ రివ్యూయర్స్ కి కూడా వర్తిస్తుందా?’ అని అడగ్గా, దానికి మంచు విష్ణు సమాధానం చెప్తూ ‘మేము ఇతర భాషల్లో ప్రెస్ మీట్స్ ఇవ్వాలని అనుకున్నప్పుడు, వాళ్ళకంటూ కొన్ని రూల్స్ ఉంటాయని తెలిసింది. ఉదాహరణకి తమిళం లో ప్రెస్ మీట్ ఇవ్వాలని అనుకున్నప్పుడు వాళ్లకు రోజుకి రెండు స్లాట్స్ మాత్రమే ఉంటాయి. ఆ రెండు స్లాట్స్ లో ఎదో ఒక సమయం లో మాత్రమే వాళ్ళు వస్తారు. మిగతా సమయం లో రారు. అదే విధంగా బాలీవుడ్ లో ప్రెస్ ని పిలిచే ముందు వాళ్లకు సినిమాని ముందుగా చూపించాలి. అలా కొంతమంది విలేఖరులకు ఈ సినిమాని వేసి చూపించాము’.
‘అందులో ఒకరికి కన్నప్ప స్టోరీ నే తెలియదు. అతను ఈ సినిమాని చూసి కన్నీళ్లు పెట్టుకొని నన్ను ఎమోషనల్ గా హత్తుకున్నాడు. సినిమాకి రివ్యూ కూడా భారీ రేంజ్ లో ఇచ్చాడు. కానీ అదే రోజు రాత్రి సినిమాని చూడని వాళ్ళు దాదాపుగా 50 మందికి పైగా ‘1’ రేటింగ్ ఇచ్చారు. అలా కావాలని సినిమాని చంపాలని చూస్తున్న వారికి మాత్రమే ఆ వార్నింగ్ కానీ, మీలాంటి ప్రొఫెషనల్ విలేఖరులకు కాదు’ అంటూ మంచు విష్ణు క్లారిటీ ఇచ్చాడు. ఇది ఇలా ఉండగా కాసేపటి క్రితమే సోషల్ మీడియా లో మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్ ‘కన్నప్ప’ టీం కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పోస్ట్ వేసాడు. దీని ప్రస్తావన కూడా తీసుకొచ్చి మీ తమ్ముడు ఇలా కన్నప్ప కి శుభాకాంక్షలు తెలియజేశాడు అనే విషయాన్ని మంచు విష్ణు వద్దకు తీసుకొస్తే ‘దయచేసి కన్నప్ప గురించి మాత్రమే ప్రశ్నలు అడగండి’ అంటూ చెప్పుకొచ్చాడు.
