Manchu Vishnu vs Manoj : ‘కన్నప్ప'(Kannappa Movie) సినిమాకు సంబంధించిన హార్డ్ డ్రైవ్ మిస్ అయ్యిందని ఇటీవల మీడియా లో వచ్చిన ఒక వార్త ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆఫీస్ బాయ్ రఘు, చరిత కలిసి ఈ కుట్రకు పాల్పడ్డారని, వీళ్లిద్దరు మనోజ్(Manchu Manoj) మనుషులని నిన్న మొన్నటి వరకు మంచు విష్ణు(Manchu Vishnu) వర్గం ఆరోపణలు చేసింది. రీసెంట్ గా ‘భైరవం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మంచు మనోజ్ చరితకు కృతఙ్ఞతలు తెలియజేయడం సంచలనంగా మారింది. అమ్మాయివి అయ్యుండి ఒక మగాడికి ఎదురెళ్లి నిజాయితీ వైపు నిలబడ్డావు, మీకు నేను జీవితాంతం తోడు ఉంటాను అని చెప్పుకొచ్చాడు. దీంతో అందరూ ఈ పని మంచు మనోజ్ చేయించి ఉంటాడని ఫిక్స్ అయిపోయారు. మనోజ్ కూడా ఈ సంఘటనపై పెద్దగా ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే రీసెంట్ గా ‘కన్నప్ప’ ప్రొమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు బాగా వైరల్ అయ్యాయి.
Also Read : RCB విజయం.. గత్తరలేపిన అల్లు అయాన్.. వైరల్ అవుతున్న వీడియో!
ఆయన మాట్లాడుతూ ‘రఘు, చరిత అనే ఇద్దరు వ్యక్తులు మనోజ్ గారి మనుషులు. వాళ్లిద్దరే ఆ హార్డ్ డ్రైవ్ ని మాయం అయ్యేలా చేశారు. ముందుగా మేము హార్డ్ డ్రైవ్ తిరిగి ఇవ్వమని మధ్యవర్తిత్వం చేసే ప్రయత్నం చేసాము. కానీ అతను ఇవ్వలేదు. దీంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. ఇక నిజానిజాలేంటో వాళ్ళే తెలుస్తారు. హార్డ్ డ్రైవ్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది. ఇంకా మాదగ్గరకు రాలేదు. వాళ్ళు సినిమాని లీక్ చేయకుండా ఉంటే ఎలాంటి సమస్య లేదు. దానికి ఆల్రెడీ పాస్ వర్డ్ ఉంది. కానీ ఏ పాస్ వర్డ్ కూడా వంద శాతం సెక్యూరిటీ ఇవ్వలేదు, కేవలం 99 శాతం మాత్రమే సెక్యూరిటీ ఇస్తుంది’ అంటూ చెప్పుకొస్తున్నారు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
మంచు విష్ణు ఏ చిన్న ఆరోపణ చేసినా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నిజానిజాలు తెలియజేసే మనోజ్ ఈ అంశంపై మౌనం వహించడం చూస్తుంటే, నిజంగానే ఆ హార్డ్ డ్రైవ్ తన దగ్గరే పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. అన్నాదమ్ముల మధ్య ప్రతీసారి ఈ చిల్లర గొడవలేంటో మాకు అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క ఈ చిత్రం ఈ నెల 27 న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే ప్రొమోషన్స్ ప్రారంభించారు. కర్ణాటక లో కూడా ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. వాయిదా పడుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ అందులో ఎలాంటి నిజం లేదని అంటున్నారు. ఈ చిత్రం లో రెబల్ స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చూడాలి మరి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుంది అనేది.
క్ననప్ప హార్డ్ డ్రైవ్ మనోజ్ మనుషుల దగ్గర ఉందని తెలిసి, తిరిగివ్వమని మధ్యవర్తులతో చర్చలు జరిపాము కానీ ఇవ్వమన్నారు అందుకే పోలీస్ కేసు నమోదు చేశాము – హీరో విష్ణు pic.twitter.com/AFG7XIOdlG
— Telugu Scribe (@TeluguScribe) June 4, 2025