Manchu Vishnu: 1976లో కృష్ణంరాజు హీరోగా దర్శకుడు బాపు తెరకెక్కించిన భక్తిరస చిత్రం భక్త కన్నప్ప. ఈ మూవీ కృష్ణంరాజుకి భారీ ఫేమ్ తెచ్చిపెట్టింది. ఆ దెబ్బతో స్టార్ హీరోల లిస్ట్ లో చేరాడు. కృష్ణంరాజు నటవారసుడిగా భక్త కన్నప్ప తన డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రభాస్ ఒకటి రెండు సందర్భాల్లో చెప్పారు. అలాగే కృష్ణంరాజు భక్త కన్నప్ప రీమేక్ చేస్తే చూడాలని ఉందని కృష్ణంరాజు తన కోరిక బయటపెట్టారు. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఓ సెంటిమెంట్ గా భావించే భక్త కన్నప్ప మూవీ మంచు విష్ణు స్టార్ట్ చేయడం చర్చకు దారి తీసింది.
నిన్న శ్రీకాళహస్తి వేదికగా కన్నప్ప మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కన్నప్ప లాంచింగ్ ఈవెంట్లో మంచు విష్ణు, మోహన్ బాబు, నుపుర్ సనన్ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది. పాన్ ఇండియా మూవీగా వంద కోట్లకు పైగా బడ్జెట్ తో కన్నప్ప తెరకెక్కనుందట. మహాభారతం టెలివిజన్ సిరీస్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించనున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రభాస్ డ్రీమ్ ప్రాజెక్ట్ మంచు విష్ణు స్టార్ట్ చేయడం ఫ్యాన్స్ అసహనానికి గురవుతున్నారు. ఈ చిత్రం ప్రభాస్ చేయాల్సింది అంటూ వాపోతున్నారు. ఇక కన్నప్ప మూవీతో మంచు విష్ణు రిస్క్ చేస్తున్నట్లే లెక్క. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన సినిమాకు పది కోట్లు రావడం కూడా కష్టమే. అంతగా విష్ణు మార్కెట్ డామేజ్ అయ్యింది. వందల కోట్లతో సినిమా చేస్తే మరి వసూళ్లు ఆ స్థాయిలో ఉంటాయా? అనేది చూడాలి. మంచు విష్ణు గత చిత్రం జిన్నా కనీసం రెండు కోట్ల వసూళ్లు రాబట్టలేదు.
అందులోనూ జిన్నా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ వసూళ్లు రాలేదు. గతంలో మోసగాళ్లు పేరుతో భారీ క్రైమ్ థ్రిల్లర్ చేసిన మంచు విష్ణు కోట్లలో నష్టపోయాడు. ఆ సినిమా సైతం మినిమమ్ వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇప్పుడు కన్నప్ప మీద వందల కోట్లు పెట్టుబడిగా పెడుతున్నారు. ఇది మంచు విష్ణు చేస్తున్న గొప్ప సాహసం అనుకోవచ్చు. అలాగే ఈ చిత్రంలో మోహన్ బాబు ఓ కీలక రోల్ చేస్తున్నాడట.