MAA Elections 2021: ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీపడుతున్న హీరో మంచు విష్ణు హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. మంచు విష్ణు ప్యానెల్ ఒక్కో సభ్యుడికి రూ.10వేలు ఇస్తోందని నాగబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికి తాజాగా మంచు విష్ణు కౌంటర్ ఇచ్చాడు. ‘మా ఎన్నికల్లో ఒక్కో సభ్యుడికి రూ.75వేలు ఇస్తున్నామని.. తన తండ్రి మోహన్ బాబు, తమ్ముడు మనోజ్, అక్క లక్ష్మీకి కూడా ఇచ్చానని’ మంచు విష్ణు సెటైర్లు వేశారు. స్టార్ హీరో మహేష్ బాబుకు కూడా గూగుల్ పే చేశానని తెలిపారు. ఆయన ఊళ్లో లేకపోవడంతో చూసుకోలేదంటూ నాగబాబుకు సెటైర్లు వేస్తూ వెటకారంగా మాట్లాడారు.

ఓటు వేయని వాళ్లను గుర్తు పెట్టుకొని మరీ ఆ రూ.75వేలు వెనక్కి తిరిగి తీసుకుంటానని.. అదే తన అజెండా అని మంచు విష్ణు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.గురువారం ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ఏజెండా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ హాట్ కామెంట్స్ చేశారు.
‘లోకల్ నాన్ లోకల్’ సమస్య కాదని.. అవకాశాలు ముఖ్యమని మంచు విష్ణు మాట మార్చారు. ‘మా’ మేనిఫెస్టోలో నూటికి 95 మంది నటులు తమని తాము ప్రమోట్ చేసుకోలేరు.. అందుకే వాళ్లకు సహకరిస్తాం.. జాబ్ కమిటీ వచ్చినప్పుడు నిర్మాతలు మాకు సహకరిస్తారనే నమ్మకం ఉంది అని మంచు విష్ణు తెలిపారు.
భారతదేశంలో ఏ నటుడైనా ఎక్కడైనా నటించవచ్చు.. టాలెంట్ ఉంటే తప్పకుండా ఏ భాష వాళ్లైనా తీసుకుంటారని.. క్రియేటివ్ ఇండస్ట్రీలో రిజర్వేషన్ అనేది అసాధ్యం.. నా వరకూ అది నాన్సెన్స్ అని మంచు విష్ణు నాన్ లోకల్ ఇష్యూ పై దాటవేశారు.
పరభాష నటుల అవకాశం రాకూడదని.. ‘మోహన్ బాబు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్థాపిస్తున్నాం’ అని మంచు విష్ణు అన్నారు. రవిబాబు ఒక రాడికల్ వ్యక్తి అని.. ఆయనంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన తెలుగువారికే అవకాశం ఇవ్వాలన్న దాంట్లో చాలా వరకూ నిజం ఉందని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.