Manchu Vishnu: టాలీవుడ్ లో మా అసోసియేషన్ ఎన్నికల ఎంత రచ్చ క్రియేట్ చేసాయో అందరికీ తెలిసిన విషయమే. మా ఎన్నికల ముందు మీడియా లో ఎంత హాట్ టాపిక్ అయ్యాయో… ఎన్నికల అనంతరం కూడా అంతే హాట్ టాపిక్ గా నడుస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన అలయ్ భలయ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ , మంచు విష్ణు పాల్గొన్నారు. ఈ వేడుకలో వీరిద్దరు పక్క పక్కనే కూర్చున్నా కానీ మాట్లాడుకోలేదంటూ మీడియా లో వార్తలు రావడం మనం గమనించవచ్చు.

అయితే ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, మంచు విష్ణును అస్సలు పట్టించుకోలేదని… టీవీ చానెళ్లు, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక దీనిపై నిన్న మంచు విష్ణు నిన్న తిరుపతిలో కూడా స్పందించారు. అవన్ని తప్పుడు వార్తలని, పవన్ కళ్యాణ్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని… ఆయనతో తనకు ఎటువంటి విభేదాలు లేవని వెల్లడించారు. స్టేజ్‌పైన ఏం జరిగిందో చూశారు కానీ అంతకు ముందే స్టేజ్ కింద… తామిద్దరం మాట్లాడుకున్నామని విష్ణు తెలిపారు. స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత ఎవరి స్థానంలో వాళ్లం కూర్చున్నామని వివరించారు.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తో ఆయన మాట్లాడిన వీడియోను మంచు విష్ణు షేర్ చేశారు. ఈ వీడియోలో పవన్, విష్ణు చాలా సరదగా ముచ్చటించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్ గా మారింది. మంచు , మెగా ఫ్యామిలి మధ్య విబేధాలు ఏమి లేవని ఈ వీడియో చూస్తుంటే అర్దం అవుతుంది. ఇకనైనా తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదాలకు తెరపడి… అంతా మాములుగా మారి కలిసి ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.
What really went down 😎. https://t.co/6uHvs1He2S
— Vishnu Manchu (@iVishnuManchu) October 19, 2021