Manchu Vishnu: మంచు విష్ణుకి అడపా దడపా కొన్ని హిట్లు వచ్చినా స్టార్ మాత్రం కాలేకపోయాడు. దీనికితోడు ఐదారేళ్ల నుంచి మంచు విష్ణుకి ఓ మోస్తరు స్థాయి సినిమా కూడా పడలేదు. మొత్తానికి తనకు హీరోగా పెద్దగా కలిసి రాకపోయినా.. సినిమాలకు మాత్రం బ్రేక్ ఇవ్వడం లేదు ఈ మంచు హీరో. ప్రస్తుతం జిన్నా అనే మూవీ చేస్తున్నాడు. అక్టోబర్ 21న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశాడు.

నిజానికి గత కొన్ని నెలలుగా మంచు ఫ్యామిలీ పై ట్రోలర్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. ఆ మధ్య టంగుటూరి వీరేహం బకాహం పంతులు అంటూ విష్ణు అడ్డంగా బుక్ అయ్యాడు. కొన్ని పదాలను తప్పుగా ఉచ్చరిస్తే.. కామెడీగానే ఉంటుంది. తప్పుగా ఉచ్చరించే పదాలు ఆ వ్యక్తి గౌరవాన్ని పోగొడతాయి. పైగా నోటికి వచ్చినట్టు లేదా నోరు తిరగని దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అందరూ హేళన చేస్తారు. మంచు విష్ణు కూడా అలాగే నవ్వులపాలు అయ్యాడు.
Also Read: Husband And Wife Relationship: భార్యలంటే మామూలోళ్ళా: అట్లుంటది వాళ్లతోని
అప్పటి నుంచి విష్ణు పై మంచు ఫ్యామిలీ పై కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ విరుచుకుపడుతున్నాయి. ఐతే, తమను ట్రోల్ చేస్తున్న వారి పై మంచు విష్ణు యుద్ధానికి దిగాడు. లీగల్ గా ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నాపై నా ఫ్యామిలీ పై నెగెటివ్ మీమ్స్ వేసిన వారినీ, యూట్యూబ్‌లో నెగెటివ్ కంటెంట్ పెట్టిన వారినీ పిలిచాను. వారు తమ తప్పు తెలుసుకున్నారు.

కానీ, కావాలని మమ్మల్ని టార్గెట్ చేసి రాసేవారిని మాత్రం వదిలిపెట్టను. ‘మా’ ఎన్నికల సమయంలో మమ్మల్ని బాగా ట్రోల్ చేశారు. మీ పై ట్రోల్స్ వస్తుంటే ఎందుకు పట్టించుకోరు ? అని చాలామంది నన్ను అడిగారు. అప్పుడు ఎలక్షన్స్ పైనే ఎక్కువ దృష్టి పెట్టాను. ఇప్పుడు ట్రోల్స్ చేసిన వారిపై దృష్టి పెడుతున్నా. ఆల్ రెడీ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం. జూబ్లీహిల్స్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీతోపాటు ఓ ప్రముఖ హీరో ఆఫీసుకు సంబంధించిన ఐపీ అడ్రస్‌లు బయటపడ్డాయి. ఆడవారిని విమర్శిస్తే ‘మా’ చాలా సీరియస్‌గా తీసుకుంటుంది’’ అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. మరి ఆ హీరో ఎవరు అనేది మంచు విష్ణు మాత్రం బయట పెట్టలేదు.
అలాగే, ఎన్నికల పై కూడా విష్ణు సంచలన కామెంట్స్ చేశాడు. మీరు ‘మా’ ప్రెసిడెంట్‌గా మళ్లీ పోటీ చేస్తారా అని అడిగితే.. లేదు. ఇక నేను మళ్లీ ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయను అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈ మధ్య మంచు విష్ణు రాజకీయాల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆ రూమర్స్ కి కూడా క్లారిటీ ఇస్తూ మంచు విష్ణు పై విధంగా మాట్లాడారు.
[…] […]