https://oktelugu.com/

Manchu Vishnu : మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా ఫెయిల్ అయ్యాడు : ప్రకాష్ రాజ్

తను గెలిచి ఉంటే ఇప్పటివరకు తను ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసే వాడినంటు ఎప్పుడైనా సరే సమర్ధుడిని గెలిపించుకోవాలి అంటూ హితవు పలికాడు. ఇలా ప్రకాష్ రాజ్ మంచు విష్ణు పైన కామెంట్ చేయడం చూసిన మంచు విష్ణు మాత్రం సైలెంట్ గా ఉంటున్నాడు...ఇక ఇప్పుడు విష్ణు భక్త కన్నప్ప సినిమాలో బిజీ గా ఉంటున్నాడు...

Written By:
  • NARESH
  • , Updated On : November 25, 2023 / 10:08 PM IST
    Follow us on

    Manchu Vishnu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వైవిధ్యమైన నటనని కనబరుస్తూ ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే వైవిధ్యమైన నటనని కనబరుస్తూ ఇండస్ట్రీలో నటుడి గా మంచి పేరు సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ తనకంటూ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇక ఏ పాత్ర అయిన సరే అలవోకగా చేస్తాడు అనే ఒక పేరును సంపాదించుకున్నాడు. ఈయన చేసిన పాత్రలు ఇండస్ట్రీలో మరే నటుడు చేయలేడు అనేది మాత్రం వాస్తవం ఇక తనకు ఇప్పటికే చాలాసార్లు నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి…

    అయితే గత రెండు సంవత్సరాల క్రితం మా ఎలక్షన్లలో మంచు విష్ణు మీద పోటీ చేసి దారుణంగా ఓడిపోయాడు. అయితే ప్రకాష్ రాజ్ ఓడిపోవడానికి మంచు విష్ణు గెలవడానికి ముఖ్య కారణం ఏంటంటే మా అసోసియేషన్ లో అందరూ మీట్ అవడానికి సొంతంగా ఒక ఆఫీస్ లేదు ఏది ఉన్న కూడా తాత్కాలికంగానే ఉంటుంది తప్ప దాని కంటు సపరేట్ గా ఒక బిల్డింగ్ అనేది లేకపోవడంతో ఈసారి తను గెలిస్తే మంచు విష్ణు తన సొంత డబ్బులతో బిల్డింగ్ కట్టిస్తాను అని హామీ ఇచ్చాడు. అలాగే ఖాళీ గా ఉంటున్న చాలామంది నటులకు సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చేలాగా ఒక నిబంధనను ఏర్పాటు చేస్తానని చెప్పాడు.

    ఇక దాంతో చాలామంది నటులు ఆయన వైపు ఓట్లు వేశారు దాంతో ఆ ఎలక్షన్స్ లో ఆయన విజయం సాధించారు. అయితే మా ప్రెసిడెంట్ గా మంచు విష్ణు గెలిచినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు మా అసోసియేషన్ కి ఆయన చేసింది ఏమీ లేదని రీసెంట్ గా ప్రకాష్ రాజ్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఒక్క జనరల్ బాడీ మీటింగ్ ని కూడా అరెంజ్ చేయలేదని టోటల్ గా మా అధ్యక్షుడిగా విష్ణు ఫెయిల్ అయ్యాడు, మా బిల్డింగ్ ని కట్టిస్తాను అని చెప్పాడు కనీసం ఇప్పటివరకు ఆ బిల్డింగ్ కి శంకుస్థాపన కూడా చేయలేదు. ఎందుకు ఆయన ఇలా చేస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కావడం లేదు అంటూ తీవ్రస్థాయిలో విష్ణుని విమర్శించాడు.

    తను గెలిచి ఉంటే ఇప్పటివరకు తను ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసే వాడినంటు ఎప్పుడైనా సరే సమర్ధుడిని గెలిపించుకోవాలి అంటూ హితవు పలికాడు. ఇలా ప్రకాష్ రాజ్ మంచు విష్ణు పైన కామెంట్ చేయడం చూసిన మంచు విష్ణు మాత్రం సైలెంట్ గా ఉంటున్నాడు…ఇక ఇప్పుడు విష్ణు భక్త కన్నప్ప సినిమాలో బిజీ గా ఉంటున్నాడు…