https://oktelugu.com/

Manchu Vishnu : కన్నప్ప’ కి ఇప్పట్లో మోక్షం దక్కదా..? వైరల్ అవుతున్న మంచు విష్ణు లేటెస్ట్ కామెంట్స్!

రీసెంట్ గానే ఈ సినిమాలోని ప్రభాస్ లుక్ సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. ఈ లీక్ పై కన్నప్ప టీం చాలా ఫైర్ అయ్యింది. లీక్ చేసిన వ్యక్తిని వెంటనే పోలీసులకు పట్టించి, ఆ ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది మూవీ టీం.

Written By:
  • Vicky
  • , Updated On : November 14, 2024 / 09:44 PM IST

    Manchu Vishnu

    Follow us on

    Manchu Vishnu : మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. తన ప్రాజెక్ట్ గీతా చెప్పుకునే విష్ణు, ఈ చిత్రాన్ని ఎంతో పవిత్రంగా భావించి, ఔట్పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు దూసుకెళ్తున్నారు. మహాభారతం లాంటి ఆల్ టైం క్లాసిక్ సీరియల్ ని మన ఇండియన్స్ కి అందించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాలోని ప్రభాస్ లుక్ సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. ఈ లీక్ పై కన్నప్ప టీం చాలా ఫైర్ అయ్యింది. లీక్ చేసిన వ్యక్తిని వెంటనే పోలీసులకు పట్టించి, ఆ ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది మూవీ టీం.

    ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. నిన్న మొన్నటి వరకు ఈ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది అంటూ సోషల్ మీడియా లో ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కావడం లేదని స్వయంగా మంచు విష్ణు అధికారిక ప్రకటన చేసాడు. నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకొని, తిరిగి వస్తున్నవిష్ణు మీడియా తో కాసేపు ముచ్చటించారు. కన్నప్ప చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది, ఇది నిజమేనా అని విష్ణు ని రిపోర్టర్స్ అడగగా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘డిసెంబర్ 20న విడుదల చేయాలని అనుకున్నాము. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉంది. VFX వర్క్ కూడా చాలా పెద్దదే. అందుకే డిసెంబర్ నుండి వాయిదా వేసి సమ్మర్ కి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాము’ అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

    ఇది ఇలా ఉండగా ఈ చిత్రంలో ప్రభాస్ మహాశివుడి క్యారక్టర్ లో కనిపించబోతున్నాడని కొందరు, నంది క్యారక్టర్ లో కనిపించబోతున్నాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా లో మొన్న లీకైన గెటప్ ని చూస్తుంటే ప్రభాస్ శివుడి క్యారక్టర్ చూస్తున్నట్టుగానే అనిపించింది . అదే విధంగా నంది క్యారక్టర్ ని అక్షయ్ కుమార్ పోషించినట్టు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న మిగిలిన నటీనటుల గురించి మూవీ టీం ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని విడుదల చేసింది కానీ, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్స్ ఫస్ట్ లుక్స్ ని మాత్రం విడుదల చేయలేదు. ప్రస్తుతానికి సస్పెన్స్ లోనే పెట్టారు. టీజర్ కి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని టాక్.