Manchu Vishnu: హీరోయిన్లు అంటే అందరికీ లోకువే. ముఖ్యంగా యూట్యూబ్ ఛానెల్స్ వారికీ హీరోయిన్ల పై కనీస గౌరవం ఉండదు. వాళ్ళ పై ఇష్టమొచ్చినట్లు పిచ్చి రాతలు రాస్తూ ఎలాగోలా తమ వ్యాపార బండిని లాక్కెళ్తున్నారు. కానీ, తమ పై వచ్చే ఆ అభ్యంతరకర వీడియోలను చూడలేక సదరు నటీనటులు, వాళ్ళ కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి.

అందుకే ఎట్టిపరిస్థితిలో హీరోయిన్ల పై పెట్టే అభ్యంతరకర వీడియోలను ఉపేక్షించేది లేదంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టి ‘మా’ తాజా అధ్యక్షుడు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చాడు. ఈ మీటింగ్ లో విష్ణుకు ఒక సన్మానం జరిగింది లేండి. తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ వారు ఆ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదేంటి ? ఇలాంటి అసోసియేషన్ కూడా ఉందా అంటే ? ఉంది. కాకపోతే జనమే ఎక్కువ ఉండరు.
మీడియా రంగంలో ముదిరిపోయిన కొందరు పెట్టుకున్న ఈ సంస్థ చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న విష్ణు మీడియాను ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడాడు. విష్ణు మాటల్లోనే ‘కొన్ని యూట్యూబ్ ఛానళ్లు హీరోయిన్ల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాయి, ముఖ్యంగా అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాయి. అలాంటి ఛానళ్ల పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
మెయిన్ గా యూట్యూబ్ ఛానళ్ల థంబ్ నైల్స్ హద్దులు మీరుతున్నాయని అందరికి తెలుసు. అలాంటి వాటి పై కఠిన చర్యలు తీసుకోవడం తప్పు లేదు. అయినా తెలుగు పరిశ్రమలోని నటీమణులు మన ఆడపడుచూలు. వారిని గౌరవించాల్సిన బాధ్యత మన అందరి పై ఉంది. అందుకే హీరోయిన్లపై పెట్టే అభ్యంతరకర వీడియోల పై లీగల్ గా చర్యలు తీసుకోబోతున్నాయి.
అలాగే ఫేక్ యూట్యూబ్ ఛానళ్ల నియంత్రణకు ఓ ప్రత్యేక లీగల్ సెల్ ను ఏర్పాటు చేశాము. పరిధి దాటే ఇలాంటి యూట్యూబ్ ఛానళ్లను నియంత్రిండం తన ఎజెండాలో ఓ అంశమని విష్ణు సగర్వంగా చెప్పుకొచ్చాడు.