Manchu Manoj : చాలా కాలం నుండి మంచు కుటుంబం లో జరుగుతున్న వివాదాలను మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ వివాదాల్లో సోషల్ మీడియా లోని నెటిజెన్స్ నుండి మంచు మనోజ్(Manchu Manoj) కి మంచి సపోర్ట్ ఉంది. అదే విధంగా ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంత వయస్సు వచ్చింది, ఆస్తి కోసం కుటుంబ పరువు మర్యాదలను రోడ్డు మీదకు లాక్కొని రావడం అవసరమా అని మనోజ్ ని విమర్శించే వాళ్ళు ఉన్నారు. కానీ తాను ఆస్తి కోసం ఎప్పుడూ ఎదురు చూడలేదని మనోజ్ ఇటీవల ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తెలిపాడు. అదే విధంగా విష్ణు పై ఆయన చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. తనకు ఇంట్లో ఉండేందుకు హై కోర్ట్ అనుమతిని ఇచ్చినప్పటికీ, విష్ణు(Manchu Vishnu) తన మనుషులతో నన్ను లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నాడని నిన్న ఆయన ఇంటి గేట్ ముందు ధర్నా చేసిన ఘటన పెద్ద దుమారమే రేపింది.
Also Read : చిన్నప్పటి నుండి విష్ణుకి నేనంటే కుళ్ళు..మొత్తం దోచేశాడు – మంచు మనోజ్
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తాను ఎందుకు ఇంత గొడవ చేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘మోహన్ బాబు(Manchu Mohan Babu) యూనివర్సిటీ(MBU) లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు కోసం నిలబడి ప్రశ్నించినందుకే ఈ గొడవలు మొదలు అయ్యాయి. కేవలం ప్రశ్నించాను అనే కారణంతోనే నాపై ఎన్నో తప్పుడు కథనాలను మీడియా ద్వారా వ్యాప్తి చేశారు. నాపై ఇప్పటి వరకు దాదాపుగా 30 కేసులు పెట్టించారు. కుటుంబం కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా గొడ్డులాగా పని చేశాను. మా నాన్నకు సంబంధించిన సినిమాలన్నీ మా అన్న సంస్థలోనే నిర్మితమవుతాయి. సన్ ఆఫ్ ఇండియా లో ఒక పాట కోసం కోటిన్నర బడ్జెట్ ని ఖర్చు చేసినట్టు విష్ణు ప్రచారం చేసాడు. ఆ పాట ఔట్పుట్ మీరంతా చూసే ఉంటారు. ఒక చిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఆ పాటని చుట్టేశారు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ గొడవల్లోకి ఎంతో గౌరవంగా బ్రతుకుతున్న నా భార్య ని లాగారు. అందుకే ఇంత దూరం వచ్చాను. తన్న వల్లనే నేను చెడిపోతున్నాను అట, అలాంటి స్టేట్మెంట్స్ తో FIR లో నా భార్యాపిల్లల పేర్లు ఎప్పుడైతే పెట్టారో, అప్పుడే నా మనసు విరిగిపోయింది. నేను ఎలాంటి తప్పు చేయలేదు. మా నాన్న ఆస్తి లో ఒక్క రూపాయి కూడా నేను అడగలేదు. అందుకే నేను దేనికి భయపడట్లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్. ఇకపోతే మనోజ్ చాలా కాలం తర్వాత మళ్ళీ ‘భైరవం’ చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం మనోజ్ తో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ లు కూడా నటించారు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెలలో మన ముందుకు రాబోతుంది.
Also Read : ఫ్యామిలీ తగాదాల పై ఎట్టకేలకు అసలు నిజాలు బయటపెట్టిన మంచు మనోజ్.. ఇంత జరిగిందా !
