Manchu Manoj : గత కొంతకాలం నుండి మంచు కుటుంబం లో జరుగుతున్న గొడవలను, వివాదాలను మనమంతా చూస్తూనే ఉన్నాం. మంచు మనోజ్(Manchu Manoj) మరియు మంచు విష్ణు(Manchu Vishnu) మధ్య ఆస్తి విషయం లో పెద్ద యుద్ధమే నడుస్తుంది. మంచు విష్ణు వైపు మోహన్ బాబు(Manchu Mohan Babu) నిలబడ్డాడు. మనోజ్ ని తన ఇంటి నుండి గెంటేశాడు. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలను మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. మంచు విష్ణు ఇప్పటి వరకు మనోజ్ పై పబ్లిక్ లో ఒక్క నెగటివ్ కామెంట్ కూడా డైరెక్ట్ గా చేయలేదు కానీ, మనోజ్ మాత్రం విష్ణు పై ఎన్నో సెటైర్లు వేస్తూ వచ్చాడు. రీసెంట్ గా జరిగిన ‘భైరవం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా మనోజ్ తన అన్నయ్య విష్ణు పై సెటైర్లు వేయడం వివాదాస్పదంగా మారింది. అయితే మనోజ్ వెనుక ఎవరు సపోర్టుగా ఉన్నా లేకపోయినా మంచు లక్ష్మి మాత్రం సపోర్టుగా ఉంటుంది.
Also Read : వర్షం మూవీ థియేటర్ లో దారుణం.. ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ గొడవ ఎక్కడికి దారితీసిందంటే?
మనోజ్ భూమా మౌనిక ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇంట్లో ఎవరికీ కూడా ఇష్టం లేదు. కానీ మంచు లక్ష్మి మాత్రం వీళ్లిద్దరి పెళ్ళికి మద్దతు తెలపడమే కాకుండా, స్వయంగా తన ఇంట్లో వీళ్ళ పెళ్లి చేయించింది. ఇది అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పెళ్లి కి మోహన్ బాబు, విష్ణు లు కూడా హాజరు అయ్యారు. అయితే గత ఏడాది నుండి ఒకపక్క తండ్రి మోహన్ బాబు తో, మరోపక్క అన్నయ్య విష్ణు తో మనోజ్ పోరాటం చేస్తుంటే, మంచు లక్ష్మి(Manchu Lakshmi) మాత్రం ఎవరి వైపు నిలబడకుండా చాలా సైలెన్స్ మైంటైన్ చేసింది. అయితే ఈమధ్య కాలం లో ఒక ఈవెంట్ లో మనోజ్ మంచు లక్ష్మి ని పలకరించడానికి దగ్గరగా వెళ్లగా,మనోజ్ ని చూసి లక్ష్మి బోరుమని ఏడ్చేస్తుంది. మనోజ్ ఆమెని ఓదారుస్తాడు. ఆ వీడియో ఎంతలా వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆ సంఘటన గురించి మనోజ్ ప్రస్తావిస్తూ ‘ఆరోజు మా అక్క అంత ఎమోషనల్ అవ్వడానికి ఒక బలమైన కారణం ఉంది. నేను నా సినిమాలతో బిజీ అయ్యాను, అక్క కూడా తన పనుల్లో బాగా బిజీ అయిపోయింది. ఇద్దరం మాట్లాడుకోవడం, కలుసుకోవడం జరిగి అప్పటికే నెల రోజులు దాటిపోయింది. ఆ క్షణం లో ఒక్కసారిగా నేను ఆమె వద్దకు వచ్చి పలకరించేలోపు ఎమోషన్ తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది. మా అక్క నాకు చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్. ఆమె నాకు నిజం చెప్పాలంటే అక్క కాదు, తల్లి లాంటిది’ అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. ఇకపోతే ఆయన ప్రధాన పాత్ర పోషించిన ‘భైరవం’ చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం లో మనోజ్ తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ లు కూడా హీరోలుగా నటించారు.
https://www.youtube.com/shorts/bgfX11xtR0Y