https://oktelugu.com/

Manchu Family Issue : ఫార్మ్ హౌస్లో మంచు ఫ్యామిలీ సీరియస్ డ్రామా, రంగంలోకి మంచు లక్ష్మి, ఇరు వర్గాలు బౌన్సర్లతో సిద్ధం, ఏం జరగనుంది?

నేడు ఫైనల్ సెటిల్మెంట్ మోహన్ బాబు ఫార్మ్ హౌస్లో చోటు చేసుకుంది. అక్కడ హై డ్రామా నెలకొంది. కాగా ముంబైలో ఉంటున్న మంచు లక్ష్మి కూడా వచ్చారట. 

Written By:
  • S Reddy
  • , Updated On : December 9, 2024 / 06:21 PM IST

    Manchu Family Issue

    Follow us on

    Manchu Family Issue :  మంచు వారి కుటుంబంలోని విబేధాలు రచ్చకెక్కాయి. ఆస్తుల కోసం భౌతిక దాడులకు దిగారు. మనోజ్ పై మోహన్ బాబు మనుషులు దాడి చేశారని సమాచారం. ఆయన గాయాలతో ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చారు. కాగా నేడు ఫైనల్ సెటిల్మెంట్ మోహన్ బాబు ఫార్మ్ హౌస్లో చోటు చేసుకుంది. అక్కడ హైడ్రామా నెలకొంది. కాగా ముంబైలో ఉంటున్న మంచు లక్ష్మి కూడా వచ్చారట. 
     
    ఆస్తుల పంపకాల విషయంలో మంచు బ్రదర్స్ మధ్య నెలకొన్న వివాదాలు తారాస్థాయికి చేరాయి. సెటిల్మెంట్ కి పిలిచి మనోజ్ పై మోహన్ బాబు మనుషులు దాడి చేశారట. ఆయన తండ్రిపై కేసు పెట్టాడని సమాచారం. కాగా నేడు జుల్పల్లి లోని ఫార్మ్ హౌస్లో హైడ్రామా చోటు చేసుకుంది. అక్కడ ఆస్తి పంపకాలకు సంబంధించిన సెటిల్మెంట్ ఏర్పాటు చేశారట. 
     
    ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే అవకాశం ఉన్న క్రమంలో ఫార్మ్ హౌస్ కి ప్రైవేట్ బౌన్సర్లు చేరుకున్నారు. విష్ణు తన తరపున 40-50 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నాడు. అదే సమయంలో మనోజ్ కూడా ఒక 30 మంది బౌన్సర్లతో అక్కడకు చేరుకున్నాడు. మనోజ్ బౌండర్లను సెక్యూరిటీ లోపలికి రానీయలేదని సమాచారం. కాగా మనోజ్ తన తల్లితో పాటు వచ్చారు. విష్ణు వస్తున్నాడట. 
     
    ముంబైలో ఉంటున్న మంచు లక్ష్మి హుటాహుటిన వచ్చింది. ఆమె కూడా ఈ సెటిల్మెంట్ లో పాల్గొననున్నారు. జుల్పల్లి ఫార్మ్ హౌస్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. ఏమి జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. మనోజ్ కి ఆస్తుల విషయంలో అన్యాయం జరిగింది అనేది ఆయన వాదన.