Manchu Lakshmi: వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది మంచు లక్ష్మి. నాలుగు పదుల వయసులో కూడా గ్లామర్ యాంగిల్ చూపిస్తుంది. మిడ్డీ ధరించి గుండెల్లో గుబులు రేపింది. మంచు లక్ష్మి ఫిట్నెస్ ఫ్రీక్ కాగా, అందం కోసం చాలా కష్టపడుతుంది. మెడిటేషన్, యోగా చేస్తుంది. కఠిన ఆసనాలతో అప్పుడప్పుడు వావ్ అనిపిస్తుంది. శరీరాన్ని విల్లులా వంచేస్తుంది. అంతటి టాలెంట్ ఆమె సొంతం. ఆహారం విషయంలో కూడా చాలా నిబద్ధతగా ఉంటుంది. అందుకే మంచు లక్ష్మి ఇంత అందంగా ఉన్నారు.
తాజాగా మంచు లక్ష్మి మిడ్డీలో సరికొత్తగా కనిపించింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా మంచు లక్ష్మి అగ్ని నక్షత్రం టైటిల్ తో ఒక చిత్రం చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి కాగా విడుదల కావాల్సి ఉంది. కారణం తెలియదు కానీ అగ్ని నక్షత్రం విడుదలకు నోచుకోవడం లేదు. మంచు లక్ష్మి చిత్రాలకు ఏ మాత్రం మార్కెట్ లేదు. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని కొనడానికి ఆసక్తి చూపకపోవచ్చు.
అదే నిజమైతే నేరుగా అగ్ని నక్షత్రం చిత్రాన్ని విడుదల చేసుకోవాల్సి వస్తుంది. అగ్ని నక్షత్రం చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేసే అవకాశం కలదు. అగ్ని నక్షత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. మోహన్ బాబు సైతం ఓ కీలక రోల్ చేశారు. అలాగే మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ చేస్తున్నట్లు మంచు లక్ష్మి ఇటీవల వెల్లడించారు. మంచు లక్ష్మి అమెరికాలో టెలివిజన్ షోస్ చేస్తారు. ఇంగ్లీష్ టాక్ షోలకు హోస్ట్ గా వ్యవహరించారు.
రెండు మూడు ఇంగ్లీష్ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆమె మొదటి చిత్రం అనగనగా ఓ ధీరుడు. ఈ మూవీలో మంచు లక్ష్మి నెగిటివ్ రోల్ చేసింది. గుండెల్లో గోదారి, లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాల్లో హీరోయిన్ రోల్స్ చేశారు. అయితే ఆమెకు ఒక ఫేమ్ అంటూ రాలేదు. పట్టు వదలకుండా హీరోయిన్ కావాలనే లక్ష్యంతో ముందుకు వెళుతుంది. ఇటీవల తన తమ్ముడు మనోజ్ వివాహం దగ్గరుండి జరిపించింది. మనోజ్, మౌనికల వివాహం మంచు లక్ష్మి నివాసంలో జరిగింది.