Homeఎంటర్టైన్మెంట్Manchu Lakshmi: పవన్ కళ్యాణ్, విష్ణు చాలాసేపు మాట్లాడుకున్నారంటున్న... మంచు లక్ష్మి

Manchu Lakshmi: పవన్ కళ్యాణ్, విష్ణు చాలాసేపు మాట్లాడుకున్నారంటున్న… మంచు లక్ష్మి

Manchu Lakshmi: మా అసోసియేషన్ ఎన్నికల వేడి ఇంకా తగ్గినట్లు లేదు … ఎన్నికల ముందు మీడియా లో ఎంత హాట్ టాపిక్ అయ్యాయో , ఇప్పుడు కూడా అంతే హాట్ టాపిక్ గా నడుస్తున్నాయి. నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన అలయ్ భలయ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ , మంచు విష్ణు పాల్గొన్నారు. ఈ వేడుకలో వీరిద్దరు పక్క పక్కనే కూర్చున్నా మాట్లాడుకోలేదంటూ మీడియా లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది మంచు లక్ష్మి.

manchu-lakshmi-gives-clarity-about-pawan-and-vishnu-issue-on-alay-bhalay-event

ఇటీవల మా ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు ప్యానల్ సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఉదయం మంచు విష్ణు, తన అక్క మంచు లక్ష్మి… తన ప్యానల్ సభ్యులు తో కలిసి శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల చేరుకున్నారు. తాము అనుకున్న పనులుచేయడానికి తగిన బలం ఇవ్వమని స్వామివారిని కోరుకుంటామని విష్ణు చెప్పారు. అలానే మా కు నూతన భవన నిర్మాణంపై మూడు నెలల్లో స్పష్టత ఇస్తానన్నారు. అలాగే మంచు లక్ష్మి మాట్లాడుతూ … విష్ణు మా అధ్యక్షుడిగా గెలవాలని ఆంధ్ర, తెలంగాణ ప్రజలు కోరుకున్నారని చెప్పారు.

విష్ణు గెలవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని … ఇప్పుడు శ్రీవెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోసం అందరం వచ్చామని లక్ష్మి తెలిపారు. అయితే నిన్న నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, విష్ణు ఎడమొహం పెడమొహంగా ఉండలేదు అని క్లారిటీ ఇచ్చింది. వారిద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారని… వారు ఉన్న ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో ఏవేవో కథలు అల్లేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. మాలో మాకు విబేధాలు లేవు మేమంతా ఒకటే అంటూ మంచి లక్ష్మి వివరించారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version