https://oktelugu.com/

Manchu Laxmi : పేద పిల్లలతో మంచులక్ష్మీ దీపావళి వేడుకలు.. ఫొటోస్ వైరల్..

పండుగ సందర్భంగా వారికి ప్రత్యేక భోజనాలు వడ్డించారు. ఆ తరువాత వారితో కలిసి బాణసంచా కాల్చారు. అనంతరం వారికి ప్రత్యేక బహుమతులు ఇచ్చి వారి కళ్లలో ఆనందాన్ని చూశారు

Written By:
  • NARESH
  • , Updated On : November 13, 2023 / 12:33 PM IST
    Follow us on

    Manchu Laxmi : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబం గురించి ప్రత్యేక చెప్పుకోవచ్చు. భక్తవత్సలనాయుడు అయినా మోహన్ బాబు తరువాత ఆయన కుమారులతో పాటు కుమార్తె కూడా సినీ రంగంలో కొనసాగుతున్నారు. కుమారులు మంచు విష్ణు, మనోజ్ హీరోలుగా రాణించారు. అయితే ప్రస్తుతం మనోజ్ సినిమాల్లో నటించడం తగ్గించరు. విష్ణు మాత్రం కన్నప్ప సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక కుమార్తె మంచు లక్ష్మి పలు సినిమాల్లో నటించి ఆ తరువాత కొన్ని సినిమాలకు నిర్మాతగా మారారు. ఆ తరువాత సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటారు. తాజాగా దీపావళి సందర్భంగా ఆమెకు సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి.

    2023 దీపావళి వేడుకలు దేశ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. సాయంత్రం లక్ష్మీ పూజలు నిర్వహించిన తరువాత బాణ సంచాలను కాల్చారు. దీపావళి వేడుకలను సినీ సెలబ్రెటీలు కొందరు ఇళ్లల్లో కుటుంబ సభ్యులతో నిర్వహించుకున్నారు. కానీ మంచు లక్ష్మీ మాత్రం అందరికీ భిన్నంగా పేద పిల్లలతో నిర్వహించారు. మంచు లక్ష్మీ టీచ్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలతో దీపావళి వేడుకలు నిర్వహించారు.

    పండుగ సందర్భంగా వారికి ప్రత్యేక భోజనాలు వడ్డించారు. ఆ తరువాత వారితో కలిసి బాణసంచా కాల్చారు. అనంతరం వారికి ప్రత్యేక బహుమతులు ఇచ్చి వారి కళ్లలో ఆనందాన్ని చూశారు. ఇతరుల కంటే భిన్నంగా ఉండడం మంచు లక్ష్మీ ప్రత్యేకం. గతంలో ఎక్కువగా సినిమాల్లో కనిపించిన ఆమె ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలతో అలరిస్తోంది. తాజాగా ఆమె పేదపిల్లలతో దీపావళి వేడుకలు నిర్వహించడంపై చాలా మంది ప్రశంసిస్తున్నారు. ప్రతి ఒక్క సెలబ్రెటీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.