
Manchu Lakshmi : మంచు లక్ష్మి ఓ వీడియో చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా రక్తం మరిగిపోతుందంటూ కామెంట్ చేశారు. మంచు లక్ష్మిని అంతగా ఆగ్రహానికి గురించి చేసిన ఆ వీడియోలో ఏముందో తెలియాలంటే ఈ సంఘటన గురించి తెలుసుకోవాలి. భారతదేశంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతుంది. రోజుకు వందల్లో, ఏడాదికి లక్షల్లో ఆడవాళ్లు అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అసలు కుటుంబ సభ్యుల మధ్య కూడా ఆడపిల్లలకు భద్రత కరువైంది. ఇటీవల సీనియర్ హీరోయిన్ కుష్బూ… సొంత తండ్రి లైంగిక వేధింపులకు గురిచేశాడని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇక ఢిల్లీలో నిర్భయ ఉదంతం ప్రకంపనలు రేపగా నిందితులకు ఉరిశిక్ష విధించారు. అయినా సమాజంలో మార్పు రాలేదు. హైదరాబాద్ శివారులో దిశా ఘటన చోటు చేసుకుంది. ఎంత కఠిన చట్టాలు తెచ్చినా ఆడవాళ్ళకు భరోసా దొరకడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఒక పోలీస్ ఆడపిల్లను వేధించడం కలకలం రేపింది. రాత్రి వేళ ఒంటరిగా వెళుతున్న యువతిని పోలీస్ అడ్డగించాడు. ఆమెను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. కాసేపటి తర్వాత ఆ యువతి ఆ కీచక పోలీస్ నుండి తప్పించుకొని వెళ్ళిపోయింది. ఈ సంఘటనను దూరం నుండి కొందరు ఫోన్లో షూట్ చేశారు.
సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. రక్షించాల్సిన పోలీసులే ఇంత దారుణానికి పాల్పడతారా అని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ మంచు లక్ష్మి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నా రక్తం మరిగిపోతుంది అంటూ… కామెంట్ చేశారు. ఇక సదరు పోలీస్ అధికారిపై ఎంపీ ప్రభుత్వం చర్యలకు ఆదేశించినట్లు సమాచారం. మంచు లక్ష్మి ఆ వీడియో షేర్ చేయడం ద్వారా సామాజిక బాధ్యత నెరవేర్చారు. ఇలాంటి దుర్మార్గులకు శిక్ష తప్పదని పరోక్షంగా తెలియజేశారు.
మంచు లక్ష్మి సంఘ సేవకురాలు కూడాను. ఆమె పలు ఎన్జీవోల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తనకున్న పరిచయాలతో ఈవెంట్స్ ఏర్పాటు చేసి ఫండ్స్ కలెక్ట్ చేస్తారు. అవి నిరుపేదల కోసం ఉపయోగిస్తారు. ఇటీవల మంచు లక్ష్మి తమ్ముడు పెళ్లి దగ్గరుండి చేసింది. మనోజ్-మౌనికల వివాహం మంచు లక్ష్మి నివాసంలో జరిగింది. తన పట్ల అక్క చూపించిన ప్రేమకు మనోజ్ కృతఙ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం మంచు లక్ష్మి అగ్ని నక్షత్రం టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు.
Blood boils https://t.co/StR428okW0
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 9, 2023