
Balayya – Srileela : టాలీవుడ్ మొత్తం శ్రీలీల జపం చేస్తుంది. సీనియర్స్, జూనియర్స్ అనే తేడా లేకుండా అందరూ ఆమె వెంటపడుతున్నారు. మహేష్, రామ్ పోతినేని, నవీన్ పోలిశెట్టి చిత్రాల్లో శ్రీలీల నటిస్తున్నారు. ఇటీవల ధమాకా మూవీతో ఈ కన్నడ బ్యూటీ బంపర్ హిట్ కొట్టింది. చెప్పాలంటే శ్రీలీల దూకుడు ముందు రవితేజ ఎనర్జీ కూడా సరిపోలేదు. క్లాసుకి క్లాసు మాసుకి మాసు… రెండు షేడ్స్ లో అదరగొట్టేసింది. ధమాకా విజయంలో శ్రీలీల కీలక పాత్ర పోషించింది. దీంతో ఆమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
కాగా బాలకృష్ణ మూవీలో శ్రీలీల నటిస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం అవుతుంది. నేడు దీనిపై క్లారిటీ వచ్చేసింది. అధికారికంగా శ్రీలీలకు ఎంబీకే 108 యూనిట్ వెల్కమ్ చెప్పారు. ఆసక్తికర పోస్టర్ విడుదల చేశారు. బాలయ్య చేతిలో చెయ్యేసి, కన్నుకొడుతూ శ్రీలీల ఐ యామ్ రెడీ అంటూ సింబాలిక్ గా చెప్పింది.బాలకృష్ణ-అనిల్ రావిపూడి మూవీ షూట్లో శ్రీలీల జాయిన్ అయ్యారు. అధికారిక ప్రకటనతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
ఇక బాలయ్య మూవీలో శ్రీలీల పాత్ర ఏమై ఉంటుందనే ఆసక్తి ఉంది. దీనిపై ఓ ప్రచారం కూడా జరిగింది. కొందరు ఆమె బాలయ్య కూతురు పాత్ర చేస్తున్నారని అంచనా వేశారు. ఈ మేరకు కథనాలు రాయడం జరిగింది. ఈ ఊహాగానాలను మేకర్స్ ఖండించారు. శ్రీలీలది కూతురు పాత్ర కాదు. ఆమె కథలో కీలమైన పాత్ర చేస్తున్నారు. సినిమాలో శ్రీలీల రోల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అదేంటనేది సస్పెన్స్ అని వెల్లడించారు. దీంతో పుకార్లకు తెర పడింది.
ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫస్ట్ టైం బాలయ్యతో కాజల్ జతకడుతున్నారు. తల్లి అయ్యాక కాజల్ కెరీర్ కొంచెం నెమ్మదించిన నేపథ్యంలో టాలీవుడ్ లో ఆమెకు కమ్ బ్యాక్ మూవీ అవుతుందని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి చిత్ర నేపథ్యం మీద హింట్ ఇచ్చారు. తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో కథ సాగుతుందని ఇటీవల వెల్లడించారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగా… తాజాగా సెకండ్ షెడ్యూల్ మొదలైంది. తారకరత్న మరణం నేపథ్యంలో షూటింగ్ కి స్వల్ప విరామం ఏర్పడింది. ఇక అఖండ, వీరసింహారెడ్డి చిత్ర విజయాలతో బాలయ్య ఫుల్ ఫార్మ్ లోకి వచ్చాడు. ఇక అనిల్ రావిపూడి మూవీతో హ్యాట్రిక్ పై కన్నేశాడు.
Glad to have the most talented & energetic @sreeleela14 join hands with Natasimham #NandamuriBalakrishna garu for #NBK108 🤗
Looking forward to an exciting journey & This is going to be a special one for us all😀@MusicThaman @sahugarapati7 @harish_peddi @Shine_Screens pic.twitter.com/lKPhILmk0a
— Anil Ravipudi (@AnilRavipudi) March 9, 2023