Manchu Family : మంచు కుటుంబంలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఆస్తి వివాదాలు, కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న మనస్పర్థలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా మంచు విష్ణు, మంచు మనోజ్ ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఓ ఫంక్షన్‌లో తమ్ముడు మంచు మనోజ్ ను చూడగానే మంచు లక్ష్మి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కా తమ్ముళ్ల మధ్య బంధాన్ని చూసి అక్కడున్నవారంతా ఎమోషనల్ అయ్యారు. నిన్న అంటే శనివారం రాత్రి హైదరాబాద్ లో నిర్వహించిన సెలబ్రిటీ ఫ్యాషన్ షోలో మంచు మనోజ్ తన అక్క మంచు లక్ష్మీని సర్ ప్రైజ్ చేశారు. తన సోదరి లక్ష్మీ స్టేజ్ పై ఉండగానే తనకు తెలియకుండా మంచు మనోజ్ ఆమె వెనుక వచ్చి నిలబడ్డాడు. సడెన్ గా మనోజ్ ను చూసిన మంచు లక్ష్మీ..ఆయనను పట్టుకుని ఎమోషనల్ అయ్యారు. మనోజ్ పట్టుకుని కన్నీరు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read : నా భార్య జోలికి వచ్చారు..అందుకే ఇంత దూరం వచ్చా – మంచు మనోజ్
కాగా.. మంచు మనోజ్, విష్ణుల మధ్య కొంత కాలంగా గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరి పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. మంచు మనోజ్ తన ఇంట్లోకి చొరబడి కారు లాక్కెళ్లాడని సోదరుడు విష్ణుపై పోలీసులకు దొంగతనం ఫిర్యాదు చేశాడు. తన కూతురు బర్త్ డే వేడుక జరుపుకునేందుకు జైపూర్ వెళ్లగా.. తన ఇంట్లోకి విష్ణు మనుషులు వచ్చి మనోజ్ ఇంట్లోని కార్లు, విలువైన వస్తువులను దొంగలించారని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తర్వాత మోహన్ బాబు ఇంటి గేట్ ముందు మంచు మనోజ్ బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. మంచు మనోజ్ ఫిర్యాదులో, “నా కూతురు పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 1న రాజస్థాన్‌కు భార్యాపిల్లలతో వెళ్లాను. నేను లేని సమయంలో విష్ణు తన సుమారు 150 మంది అనుచరులతో అక్రమంగా నా ఇంట్లోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేశాడు. నా భద్రతా సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా నా కారును కూడా ఎత్తుకెళ్లారు” అని పేర్కొన్నారు.
అంతకు ముందు హైదరాబాద్ శివారు ప్రాంతం పహాడీషరీఫ్‌లోని జల్ పల్లిలో మోహన్ బాబు ఇంట్లోకి చొరబడేందుకు మనోజ్ ప్రయత్నించారు. మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లేందుకు మనోజ్ తన కుటుంబంతో సహా అక్కడికి వెళ్లారు. అయితే, అందరినీ పోలీసులు దూరంగా ఆపేశారు. కానీ, మనోజ్‌ను మాత్రం ఇంటి వరకు అనుమతించారు.
కుటుంబ సభ్యుల మధ్య సమస్యలతో సతమతమవుతున్న తమ్ముడు మంచు మనోజ్ ని ఓ ఫంక్షన్‌లో చూడగానే కంటనీరు పెట్టుకుని ఎమోషనల్ అయిన మంచు లక్ష్మి,అక్కా తమ్ముళ్ళను ఓదార్చిన మౌనిక…. pic.twitter.com/EJB9J6bMkA
— Swathi Reddy (@Swathireddytdp) April 13, 2025