Oscar: ఆస్కార్ అర్హత సాధించిన తెలుగు సినిమాను ఒక్కసారైనా చూడాలని అందరూ కోరుకునే వారు. కానీ, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అది సాధ్యం కాలేదు. అయితే, తాజాగా తొలిసారి ఓ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. మనసానమః ప్రస్తుతం ఈ సినిమా అకాడమీ సభ్యుల ఓటింగ్ కోసం ప్రదర్శితం అవుతోంది. దర్శకుడు దీపక్‌రెడ్డి తెరకెక్కించిన ఈ షార్ట్‌ఫిల్మ్ 2020లో విడుదలైంది.
అప్పటి నుంచి 900కుపైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. 300కుపైగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించేందుకు అర్హత సాధించింది. ఈ క్రమంలోనే ఆస్కార్ బరిలో తమ సినిమా నిలవడంపై మేకర్స్ స్పందించారు. ఆస్కార్ కోసం పోటీ పడుతున్న చిత్రాల్లో మనసానమః నిలవడం గర్వకారణమని అన్నారు. ఈ ప్రౌడ్ మూమెంట్‌ను ఆస్వాధిస్తున్నట్లు తెలిపారు.
ఈ సినిమా బరిలో ఉన్న మిగతా సినిమాలను దాటుకుని.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆస్కార్ సాధించిన తొలి సినిమా అవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మరి ఇన్ని అవార్డులు గెలుచుకున్న ఈ సినిమాను ఆస్కార్ వరిస్తుందో లేదో చూడాలి.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Manasanamaha movie going to oscar race
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com