Manas-Priyanka Singh: ప్రేమైనా ద్వేషం అయినా శ్రుతి మించితే అనర్థమే. పరిమితులు ధాటిన ఫీలింగ్స్ కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. బిగ్ బాస్ హౌస్ లో ట్రాన్స్ జెండర్ ప్రియాంక, మానస్ మధ్య నడుస్తున్న విచిత్ర ప్రేమ కథ, ప్రస్తుతం అదే దశలో ఉంది. మొదటివారం నుండే ప్రియాంక మానస్ వైపు అట్రాక్ట్ కావడం జరిగింది.ఇంట్లో ఎవరినైనా అన్నయ్య అంటాను ఒక్క మానస్ ని తప్పా, అని డైరెక్ట్ గా యాంకర్ రవితో చెప్పింది. కాగా ప్రియాంక ట్రాన్స్ జెండర్ అన్నమాటే కానీ, అమ్మాయిలకు మించిన అందం తన సొంతం.
Also Read: అని మాస్టర్ కి అంతంటా.. మొత్తం రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే..!

అయితే ఏదైనా ఒక ట్రాన్స్ జెండర్ కి దగ్గర కావడం, అది కూడా పబ్లిక్ ప్లాట్ ఫార్మ్ లో అందరికీ తెలిసేలా అంటే, చాలా పెద్ద సాహసం.అందుకే మొదట్లో పింకీని మానస్ అంతగా పట్టించుకోలేదు. కానీ అతని పట్ల ఆమె కేరింగ్, లవ్ అతని మనసును మార్చేశాయి. తను కూడా కేవలం పింకీతో గడపడం స్టార్ట్ చేశారు. ఇక పింకీ ప్రేమ హద్దులు దాటేసి, ఎక్కడికో వెళ్ళిపోయింది. చివరకు గేమ్స్, టాస్క్స్ లో తన కోసం త్యాగం చేసేంతలా. ఈ వారం నిర్వహించిన కెప్టెన్సీ టాస్క్ లో వీల్ వదల కుండా పట్టుకునే గేమ్ లో అందరినీ ఓడించి, చివరకు మానస్ విషయంలో పింకీ పట్టు వదిలేసింది.
ఇవ్వన్నీ గమనిస్తున్న నాగార్జున నిన్న మానస్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి అడిగాడు. పింకీ పూర్తిగా నీ మాయలో పడిపోయింది. అది నీకు కూడా తెలుసు, తన గేమ్ కూడా తను ఆడడం లేదని చెప్పాడు. మానస్ తిట్టాడని వెక్కి వెక్కి ఏడుస్తున్న పింకీ వీడియో కూడా చూపించిన నాగార్జున, భవిష్యత్ లో దీనివల్ల నీకు సమస్యలు ఏర్పడతాయని హెచ్చరించాడు. నేను చెబుతున్నా పింకీ వినడం లేదని, ఇంకా గట్టిగా చెబితే ఏమైనా చేసుకుంటుందని భయం వేస్తుంది అన్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మానస్, పింకీ రిలేషన్ ఏ స్థాయికి వెళ్ళిందో. నాగార్జున మాత్రం స్మూత్ గా వదిలించుకో అని సలహా ఇచ్చాడు. మానస్ ఓకె అన్నాడు. మరి పింకీ పట్ల ఇకపై అతని ప్రవర్తన ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: కూతురే అమ్మగా… సంతోషంలో నటరాజ్ మాస్టర్ !