Mana Shankara Varprasad Garu Advance Bookings: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varprasad Garu) చిత్రం మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ ని అన్ని ప్రాంతాల్లో ప్రారంభిస్తున్నారు. ఇంతకు ముందు విడుదలైన సినిమాలు లాగా కాకుండా, ఈ చిత్రానికి ప్రీమియర్ షో టికెట్ రేట్ 500 లకు ఫిక్స్ చేశారు మేకర్స్. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అందుకు అంగీకారం తెలపడం తో ప్రీమియర్ షోస్ బుకింగ్స్ పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. కాసేపటి క్రితమే తెలంగాణ ప్రాంతం లో కూడా మొదలు పెట్టారు. హైదరాబాద్ లో షెడ్యూల్ చేసిన ప్రీమియర్ షోస్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. కానీ రెగ్యులర్ షోస్ మాత్రం హైదరాబాద్ వరకు డల్ గానే ఉన్నాయి. ప్రీ ఫెస్టివల్ డే కావడం, అందులోనూ సోమవారం విడుదల కావడంతో ఆ ప్రభావం ఈ చిత్రం మీద కాస్త పడిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం రెగ్యులర్ షోస్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు టాక్ వస్తే కచ్చితంగా భారీ వసూళ్లు నమోదు అవుతాయి. లేదంటే చాలా గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. సోమవారం రిలీజ్ అనేది ఒక సినిమాపై టాక్ లేకపోతే మ్యాట్నీస్ నుండే కలెక్షన్స్ లో భారీ డ్రాప్స్ నమోదు అవుతాయి. మరి ఈ సినిమాకు ఏది జరగబోతుందో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఇప్పటి వరకు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరికాసేపట్లో 30 కోట్ల గ్రాస్ మార్కు ని కూడా ఈ సినిమాని అందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రీమియర్ షోస్ మొదలు అయ్యే సమయానికి ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఎంతో తెలుస్తుంది.
తెలుగు రాష్ట్రాల సంగతి పక్కన పెడితే ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రీమియర్స్ నుండి అద్భుతమైన గ్రాస్ నమోదు అయ్యిందని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. కేవలం నార్త్ అమెరికా నుండే ఈ సినిమాకు $900K డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. USA నుండి $810K డాలర్ల గ్రాస్ వచ్చింది. అదే విధంగా యునైటెడ్ కింగ్డమ్ నుండి 30 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. మిడిల్ ఈస్ట్ లో కూడా మంచి వసూళ్లనే రాబట్టింది ఈ చిత్రం. ఓవరాల్ గా ఓవర్సీస్ నుండి 15 కోట్ల గ్రాస్ నమోదు అయ్యింది. ఇది సెన్సేషనల్ అనే చెప్పాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం యావరేజ్ రేంజ్ బుకింగ్స్ ని సొంతం చేసుకుంది.