Mana Shankara Varaprasad Garu Review Issue: చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ‘మన శంకర వరప్రసాద్’ సినిమా ఈ సంక్రాంతి కానుక జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా మీద మొదటి నుంచి ప్రేక్షకులకు మంచి అంచనాలైతే ఉన్నాయి… అనిల్ రావిపూడి ఈ సినిమాని కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే. ట్రైలర్ ని చూస్తే ఇందులో చిరంజీవి కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. వింటేజ్ చిరంజీవిని సైతం మనం ఈ సినిమాలో చూడచ్చు.
ఇక ఇదిలా ఉంటే మన శంకర వరప్రసాద్ సినిమా మీద కోర్టు సైతం ఒక కీలకమైన ఆదేశాన్ని జారీ చేసింది. బుక్ మై షో లో మన శంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించిన ఎలాంటి రివ్యూ రేటింగ్స్ పెట్టకూడదని తీర్పును ఇచ్చింది. కారణం ఏంటి అంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన చాలా సినిమాలకు ఆంటీ ఫ్యాన్స్ నెగెటివ్ రివ్యూ అండ్ రేటింగ్ లు ఇస్తున్నారు.
దానివల్ల బుక్ మై షో లోకి వెళ్లి సినిమా టికెట్లను బుక్ చేసుకోవాలనుకున్నవాళ్లు దాన్ని చూసి ఆగిపోతున్నారు… ఇలా చేయడం వల్ల బాగున్న సినిమాలకి సైతం ప్రేక్షకుల్లో ఆదరణ దక్కడం లేదనే ఉద్దేశ్యంతోనే కోర్ట్ ఇలాంటి తీర్పునైతే ఇచ్చింది. ఒకవేళ కోర్ట్ తీర్పుని దిక్కరించి బుక్ మై షో రివ్యూ అండ్ రేటింగ్ లని చూపించినట్టయితే చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఇక ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మన శంకర వరప్రసాద్ సినిమాతో పాటు మిగిలిన అన్ని సినిమాలకు కూడా ఈ నియమమైతే వర్తిస్తుంది.
కాబట్టి ఇకమీదట బుక్ మై షో లో రివ్యూ రేటింగ్ లను చూపించే ప్రసక్తే లేదు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో రాజాసాబ్ సినిమా ఇప్పటికే రిలీజ్ అయింది. కాబట్టి ఇక మీదట రాబోతున్న సినిమాలన్నింటికి ఈ నియమం వర్తించే అవకాశాలైతే ఉన్నాయి. ఈ సంక్రాంతికి ఏ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది…