Mana Shankara Varaprasad Review: చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాను అధ్యంతం కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన అనిల్ రావిపూడి తన గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాని అనుకున్న రేంజ్ లో సక్సెస్ చేయలేకపోయాడనే చెప్పాలి. మొదటి షో తోనే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి టాక్ మూటగట్టుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి అనేవి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఇక ఈ సినిమాలో చిరంజీవి నటన చాలా వరకు ప్లస్ అయింది. అలాగే తన కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాకి కొంతవరకు కలిసి వచ్చింది. ఇక తన గ్రేస్ తో చేసిన డ్యాన్సులు ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. అలాగే పాటలు సైతం ఈ సినిమాకి చాలా వరకు అడ్వాంటేజ్ గా నిలిచాయి… ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్లు సైతం ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యాయి…
ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో కథ పెద్దగా లేకపోవడం, చిరంజీవిని రొటీన్ సినిమాల మాదిరిగానే చూపించడం, పెద్దగా ఎమోషన్స్ కి స్కోప్ ఇవ్వకపోవడం లాంటివి ఈ సినిమాకి కొంతవరకు మైనస్ అయ్యాయి. ఇక ఏది ఏమైనా అభిమానులకు ఈ సినిమా విపరీతంగా నచ్చినప్పటికి సగటు ప్రేక్షకులకు మాత్రం అంత పెద్దగా నచ్చలేదనే చెప్పాలి.
చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటే ప్రేక్షకులు చాలా బాగా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ అంచనాలను అందుకునే విధంగా ఈ సినిమా లేదనే చెప్పాలి…అనిల్ రావిపూడి సైతం ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసుకొని ఈ సినిమాని చేశానని చెప్పాడు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది…