Mana Shankara Varaprasad Garu Story: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad garu) పై అభిమానుల్లో అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా కావడం, అదే విధంగా మెగాస్టార్ చాలా కాలం తర్వాత కామెడీ ఎంటర్టైన్మెంట్ జానర్ లో సినిమా చేయడం వల్ల, ఈ సినిమాపై ఈ రేంజ్ అంచనాలు ఏర్పడడానికి కారణం అయ్యాయి. వీటికి తోడు విక్టరీ వెంకటేష్ ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించడం కూడా ఈ సినిమా హైప్ ని తారా స్థాయికి తీసుకెళ్లడం లో ఉపయోగపడింది. అలా ఎన్నో ప్రత్యేకతలతో మొదలైన ఈ సినిమా మొన్నటితో షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసిందట. దీంతో నిన్న ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, తన టీం తో కలిసి ప్రెస్ మీట్ ని నిర్వహించి సినిమా విడుదల తేదీని ప్రకటించారు.
వచ్చే నెల 12వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అట. అయితే అనిల్ రావిపూడి తన ప్రతీ సినిమాకు ప్రొమోషన్స్ ఏ రేంజ్ లో చేస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కనీసం నెల రోజుల సమయం ప్రొమోషన్స్ కోసమే కేటాయిస్తాడు. ఈ చిత్రానికి కూడా ఆ రేంజ్ లోనే ప్రొమోషన్స్ చేయబోతున్నాడట. అందులో భాగంగా నిన్న ఆయన ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి తో ఇచ్చిన ఇంటర్వ్యూ లో, ఈ సినిమా గురించి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ ఇంటర్వ్యూ లో ఆయన ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ని వివరించాడు. నేషనల్ లెవెల్ సెక్యూరిటీ ఆఫీసర్ కి, మరియు అంబాని స్థాయి ఆస్తులు ఉన్న మిలినియర్ కూతురుకి పెళ్లి జరిగిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురు అయ్యాయి అనే అంశం పై ఈ సినిమా కథని డెవలప్ చేసినట్టు ఆయన చెప్పుకొచ్చాడు.
అంతే కాకుండా వీళ్లిద్దరికీ ఒక కూతురు ఉండడం, సినిమా మధ్యలో ఒక కీలక ట్విస్ట్ రావడం, ఈ అంశాల చుట్టూ కామెడీ సన్నివేశాలను రాసుకున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. చిరంజీవి గారికి కేవలం నెల రోజుల్లోనే స్క్రిప్ట్ మొత్తాన్ని డైలాగ్ వెర్షన్ తో సహా వైజాగ్ లో ఉన్నప్పుడు వెల్ వినిపించానని , ఆయనకు అద్భుతంగా నచ్చడంతో వెంటనే షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకోమని చెప్పాడని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. అనిల్ రావిపూడి మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అయితే ఈ సంక్రాంతికి వార్ వన్ సైడ్ గా ఉండబోతుందని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ 20 నిమిషాల పాటు స్క్రీన్ పై కనిపిస్తాడట. మెగాస్టార్ కాంబినేషన్ లో ఆయన సన్నివేశాలు వేరే లెవెల్ లో వచ్చాయని అంటున్నారు.